39.2 C
Hyderabad
May 3, 2024 14: 19 PM
Slider మహబూబ్ నగర్

ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి

#deo

నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి  నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుండి జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలకు 62 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,1060 మంది రెగ్యులర్ విద్యార్థలు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 5,562 బాలురు,5,498 మంది బాలికలు హాజరుకానున్నారు.

అదేవిధంగా 22 మంది ప్రైవేటు విద్యార్థులు ఒక సెంటర్లో పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు అందరూ కూడా 1 గంట ముందుగానే పరీక్ష కేంద్రాల కు చేరుకొని హాల్ టికెట్లలో వారి పరీక్ష కేంద్రాల వివరాలను తెలుసుకోవాలని సూచించారు.

అన్ని పరీక్ష కేంద్రాలలో చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి పర్యవేక్షణలో ప్రశ్నపత్రాల సీలు ఓపెన్ చేయనున్నారు. పరీక్ష కేంద్రంలో వైద్య శాఖ నుంచి ఒక ఏ.ఎన్.ఎం ను కనీస మందులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సకాలంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకొనే విధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారికి రవాణా కల్పించాలని,   జిల్లా కలెక్టర్ ఇదివరకే ఆదేశించడం జరిగిందన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ లను చూయించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

పరీక్ష కేంద్రాల వద్ద తగిన బందోబస్తు, 144 సెక్షన్, అలాగే జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఎలక్ట్రానిక్ పరికరాలను ( సెల్ ఫోన్) పరీక్ష కేంద్రంలోకి అనుమతించకుండ తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను, రెవెన్యూ శాఖను, గత సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు.

పరీక్ష విధులు నిర్వహించే ఏ ఒక్కరు కూడా సెల్ ఫోన్ తో పరీక్ష కేంద్రాలకు హాజరైతే పరీక్షల 25 యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల హాల్ టికెట్లు జారీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలన్నారు. ఆన్ లైన్ లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని సి.ఎస్.డి.ఓ వాళ్ళను ఆదేశించడం జరిగిందని, విద్యార్థులు గాని, తల్లిదండ్రులు గాని 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఏ విధమైన సందేహాలున్నా నివృత్తి కొరకు అన్ని మండలాల విద్యాధికారులతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించవచ్చన్నవారు.

జిల్లా విద్యాశాఖ అధికారి సెల్ నెం: 7995087602

పరీక్షల విభాగం అధికారి రాజ శేఖర్ రావు 7702775340

జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి 9989921105

తాడూర్, కొల్లాపూర్, కోడేర్, పెంట్లవెల్లి మండలాల విద్యాధికారి చంద్రశేఖర్ రెడ్డి 7780171814

తెల్కపల్లి, లింగాల మండలాల విద్యాధికారి చంద్రుడు నాయక్ 9441591518

కల్వకుర్తి, ఉర్కండ మండలాల విద్యాధికారి బసు నాయక్ 8309905321

వెల్దండ వంగూర్ చారకొండ మండలాల విద్యాధికారి శంకర్ నాయక్ 9959513978

అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్ మండలాల విద్యాధికారి రామారావు 9440751771

బిజినపల్లి మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి 9492064003

తిమ్మాజిపేట మండల విద్యాధికారి శ్రీనివాసులు 7702775348

అమ్రాబాద్ పదర మండలాల విద్యాధికారి బాలకిషన్ 9441566802

నాగర్ కర్నూలు మండల స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్ల శెట్టి 9440609851 నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా డిఈఓ కోరారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షల సమయంలో ఆందోళన, ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ముందుగా ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివిన తర్వాత వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలని, పదోవ తరగతి విద్యార్థులకు డిఈవో గోవిందరాజులు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

Good Decision: లాక్ డౌన్ పిరియడ్ లో అద్దె వద్దన్న ముప్పా

Satyam NEWS

వాలీబాల్ విజేత చింత‌ల‌మ‌నేప‌ల్లి జ‌ట్టు

Sub Editor

న్యూడ్ ఫొటోల కోసం అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసే కీచకుడు

Satyam NEWS

Leave a Comment