31.7 C
Hyderabad
May 7, 2024 01: 23 AM
Slider రంగారెడ్డి

సిబిఐటి కాలేజీలో యోగా శిక్షణ

#cbit

సిబిఐటి కళాశాల లో  మొదటి సంవత్సరం విద్యార్థులు కోసం స్టూడెంట్ ఇండక్షన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు యోగాసనాలు నేర్చుకొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నరసింహులు  మాట్లాడుతూ మన మానసిక, శారీరక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు యోగా అనేది ఒక వరం అని తెలిపారు. యోగాభ్యాసం మన దిన చర్యలో భాగం కావాలని ఆయన కోరారు. యోగానేది మన భారతదేశంలో పురాతన మూలాలను కలిగి ఉంది, ఇది ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర విధానం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. జీవనశైలి వ్యాధుల ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది, కాబట్టి మనం యోగా సాధన  చేయడం ఒత్తిడి ఎదురుకొనగలం అని తెలిపారు. దీన్ని దినచర్యలో భాగం చేసుకోవడం కోసం ఈ రోజు కళాశాల లో మొదటి విద్యార్థులు  సంవత్సరం విద్యార్థుల కోసం చేసిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది అని చెప్పారు. ఈ కార్యక్రమానికి యోగా థెరపిస్ట్ మరియు ప్రణవ అథ యోగా వ్యవస్థాపకుడు సిహెచ్ వీరన్న యోగా థెరపిస్ట్, యోగా చెన్నా సరిత వివిధ యోగాసనాలు గురుంచి వివరించి చేసి చూపించారు. ఇతర అధ్యాపకులు ప్రొఫెసర్ బి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ నట్టువ నటరాజు,  అసిస్టెంట్  ఫిసికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజు సాతులూరి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

Related posts

సుమాంజలి సీడ్స్ మిరప క్షేత్ర ప్రదర్శన

Murali Krishna

మేదరమెట్ల వద్ద ఘోర ప్రమాదం: ఐదుగురి మృతి

Satyam NEWS

ప్రభుత్వ సలహాదారుడుగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఉద్వాసన?

Satyam NEWS

Leave a Comment