33.7 C
Hyderabad
April 27, 2024 23: 26 PM
Slider ఖమ్మం

సుమాంజలి సీడ్స్ మిరప క్షేత్ర ప్రదర్శన

#sumanjali

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని నల్లబండబోడు గ్రామ సమీపంలో పోకలగూడెం గ్రామానికి చెందిన రైతు గుగులోతు లక్ష్మ మిర్చి తోటలో సుమాంజలి సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సుమాంజలి సీడ్స్ కంపెనీకి చెందిన హైబ్రిడ్ మిరప వంగడం అగ్ని రకానికి చెందిన విత్తనాల ప్రత్యేకత గురించి కంపెనీ ప్రతినిధులు రైతులకు వివరించారు. తెగుళ్ళు, మైట్స్ ఇతర చీడపీడలను తట్టుకొని ఎర్రనేలలో సాగు చేసిన అగ్ని రకం మిరప పంట ఆశాజనకంగా ఉందని రైతు లక్ష్మా తెలిపారు. ఈ రకం వంగడం కాయ పొడవు, కాపుతో పాటు మంచి దిగుబడి వస్తుందని వ్యక్తం చేశారు. రైతులు విత్తనం శుధ్ధి చేసుకొని విత్తితే తెగుళ్ళు తట్టుకొని  అధిక దిగుబడులు సాధించవచ్చని కంపెనీ ఫీల్డ్ స్టాఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి, సిఇఓ విజయభాస్కర్, రీజనల్ మేనేజర్ వేదప్రకాష్ , సేల్స్ ఆఫీసర్ పూల్ చంద్, జూలూరుపాడు ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్లు సురేష్, నరసింహారావు, కోటేశ్వరరావు, వేల్పుల గోపాలకృష్ణ, పోకలగూడెం డీలర్ లక్ష్మ, పలు ప్రాంతాల నుంచి వచ్చిన డీలర్లు, రైతులు పాల్గొన్నారు.

Related posts

క్యాన్సర్ నిరోధక మందులపై పరిశోధనకు కొల్లాపూర్ యువకుడి కి డాక్టరేట్

Satyam NEWS

కాళేశ్వర ఆలయంలో అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూజలు

Satyam NEWS

స్టార్ మా: ‘ఇంట్లోనే ఉండండి, ఆన్‌లైన్‌లో బిల్లు కట్టండి’

Satyam NEWS

Leave a Comment