37.2 C
Hyderabad
May 6, 2024 12: 06 PM
Slider నెల్లూరు

వి ఎస్ యూ లో ఘనంగా యోగి వేమన జయంతి వేడుక

#Yogi Vemana Jayanti

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని శ్రీ-పొట్టిశ్రీరాములు భవనంలో జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో యోగి వేమన జయంతిని పురస్కరించుకొని యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి మాట్లాడుతూ వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. “విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగు వారు ఉండరు అని అన్నారు.

వేమన 1652 – 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన పద్యాలు1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయని, పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించారని అన్నారు. 1972 లో భారత తపాలాశాఖ స్టాంపు ని కుడా విడుదల చేశారని తెలిపారు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి రామచంద్రా రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.విజయ ఆనంద్ కుమార్ బాబు, NSS ప్రోగ్రాం అధికారులు డా.కే. సునీత, డా. కే. విద్యా ప్రభాకర్ మరియు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మోడల్ మినిస్టర్: గర్భిణీ స్త్రీలు, ఆశ వర్కర్లకు పౌష్టికాహార కిట్లు

Satyam NEWS

అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి విద్యార్థుల కావలెను

Satyam NEWS

విజయనగరంలో మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్….

Satyam NEWS

Leave a Comment