30.7 C
Hyderabad
May 5, 2024 05: 03 AM
Slider పశ్చిమగోదావరి

కరోనా నివారణకు పుట్లగట్లగూడెం గ్రామాన్ని శానిటేషన్ చేసిన యువత

#village youth

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామ యువత కరోనా వేళ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది.

లక్కవరం సబ్ ఇన్స్ పెక్టరు  k. ప్రసాదు అధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న సమయంలో గ్రామంలో  యువత సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయడం మంచి కార్యక్రమమని అన్నారు.

దీని ద్వారా కరోనా వైరస్ మాత్రమే కాకుండా ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా తుడిచి పెట్టుకు పోతుందని ఎసై అన్నారు.

యువత సామాజిక సమస్యల పట్ల అవగాహనతో సరైన దారిలో ప్రయాణిస్తున్నారని, యువత వల్లనే భారతదేశం ప్రపంచదేశాలకు దారిదీపం అవుతుందని తెలిపారు.

ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు వినియోగిస్తూ, భౌతికదూరం పాటించి కరోనాను నియంత్రించాలని కోరారు.

అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యువత పారేపల్లి మణిబాబు, అద్దేపల్లి రవిలను, ప్రజలను అభినందించారు.

Related posts

భారీ వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలి

Satyam NEWS

ఆశ వర్కర్ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

Satyam NEWS

ఇదేం పోలీస్?: తొలి వెలుగు యాంకర్ రఘు అరెస్టు

Satyam NEWS

Leave a Comment