37.7 C
Hyderabad
May 4, 2024 13: 16 PM
Slider ముఖ్యంశాలు

హుజూర్ నగర్ లో ఘనంగా రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి

#ysr

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ, జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాజశేఖర్ రెడ్డి చిత్రపటానీకి పూలమాలవేసి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,సీనియర్ నాయకులు సాములు శివారెడ్డి,బాచిమంచి గిరిబాబు,మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ తదితర నాయకులు మాట్లాడుతూ మహా నాయకుడు1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు.

సామాన్య పేదవానికి అవసరమైన ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు,దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న గ్రామీణ ప్రజల కోసం ఆరోగ్య భీమా కార్యక్రమం రాజీవ్ ఆరోగ్య శ్రీగా పిలువబడుతుంది,ఇది ఏదైనా అవసరమైన శస్త్రచికిత్సకు గరిష్టంగా 2,00,000  రూపాయల వరకు మొత్తం ఖర్చును చెల్లించడానికి ప్రారంభించబడిందని, 108,104 అంబులెన్స్ సౌకర్యం,ఉచిత విద్యుత్,విద్యార్ధులకు ఫీజు రియంబర్స్మెంట్,వృద్ధాప్య పింఛన్,పావలా వడ్డి కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళలు చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి 3 శాతం వడ్డీకి ఋణాలు అందించారని తెలిపారు.

అద్భుతమైన పథకాలను రూపకల్పన చేసి,అమలుచేసిన గొప్ప మహా నాయకుడని,రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని ప్రతి పేదవాడు ఇంటిలో,గుండెల్లో ఏర్పాటు చేసుకునేలా పరిపాలన కొనసాగించారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తేజావత్ రాజా,పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య,గొట్టెముక్కుల రాములు,వార్డు కమిటీ అధ్యక్షులు కోళ్లపూడి యోహాన్,మేళ్ళచెరువు ముక్కంటి,ఇట్టిమల్ల బెంజిమెన్, అంజనపల్లి సుదర్శన్,పోతుల జ్ఞానయ్య, దొంతగాని జగన్,దాసరి పున్నయ్య, రేపాకుల కోటయ్య,ఎండి రజాక్ బాబా, సలిగంటి జానయ్య,కస్తాల సైదులు,    పోకబత్తిని జయరాజు,దాసరి రాములు, పాశం నారాయణ, వెంకటేశ్వర్లు, వీరబాబు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఎస్పీ బంగ్లా దారిలో నిలచిపోయిన ఆర్టీసీ బస్…!

Satyam NEWS

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

Satyam NEWS

రక్త నిల్వలు నిండుకున్నాయి.. రక్తదానానికి ముందుకు రండి..

Satyam NEWS

Leave a Comment