28.2 C
Hyderabad
May 9, 2024 02: 06 AM
Slider విజయనగరం

రక్త నిల్వలు నిండుకున్నాయి.. రక్తదానానికి ముందుకు రండి..

#blooddonation

విజయనగరం జిల్లాలో రక్త నిల్వలు నిండుకున్నాయని, అత్యవసరంలో రక్త కొరత బాధితులకి ప్రాణాపాయం కలిగిస్తోందని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని బీజేపీ ఎమ్మెల్సీ రఘువర్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోట రోడ్డులో గల విజయ బ్లడ్ బ్యాంక్ లో  అత్యవసర రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముఖ్య అతిధిగా  బీజేపీ ఎమ్మెల్సీ రఘు వర్మ, విశిష్ట అతిధిగా బీసీట్టి బాబ్జి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘు వర్మ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ తదితర కారణాల వల్ల రక్త సేకరణ జరగలేదని అన్నారు. దీనివల్ల అనేక చోట్ల రక్త నిల్వలు నిండుకున్నాయన్నారు. ప్రాణాలు నిలబెట్టే రక్త సేకరణకి శిబిరాలు నిర్వహించేలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు.

విజయనగరం యూత్ పౌండేషన్ అధ్యక్షులు, కార్యదర్శి షేక్ ఇల్తమాష్, అంబులెన్స్ శివ నేతృత్వంలో  యువత చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. అన్నార్తులకి ఆకలి తీర్చడం, అత్యవసరంలో ఉన్న వారికి రక్త మందించడం, పేద విద్యార్థులకు అండగా నిలిచి వారికి ఆర్ధిక సాయం చేయడం, అనాథలు, వృద్ధులను ఆదుకోవడానికి ముందుకు రావడం వంటి సేవల్లో యూత్ ఫౌండేషన్ ముందుండడం అభినందనీయని పౌర సమాజ వేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి ప్రశంసించారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాకులైన ఇల్తామాష్, శివ మరియు అనిల్ ను బీజేపీ  ఎమ్మెల్సీ రఘువర్మ ఉచిత రీతిన సత్కరించారు. సాయంత్రం 4 గంటల వరకు జరిగిన రక్త దాన శిబిరంలో సుమారు 137 మంది వరకు యువకులు రక్తదానం చేసారు.  విజయ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తం సేకరించారు. ఈ కార్యక్రమంలో ఇల్తమాష్ అంబులెన్స్ శివతో పాటు అనిల్ , అశోక్, కళ్యాణ్, సంతోష్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

గుంటూరులో డ్రగ్స్ ఆన్‌లైన్‌ విక్రయాల కలకలం

Satyam NEWS

హై కోర్టులో ఎపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

Satyam NEWS

లార్డ్ బాలాజీ సేవ్ హిం: ఎవరు బ్రష్టు పట్టించారయ్య నిన్ను ?

Satyam NEWS

Leave a Comment