31.7 C
Hyderabad
May 2, 2024 10: 46 AM
Slider నిజామాబాద్

Corona Alert: కామారెడ్డి @ 6999

#KamareddyHospital

ఇదేదో సెల్ ఫోన్ ధరనో, లేక బట్టల షాపుల దుకాణాల ఆఫరో కాదు సుమా.. కామారెడ్డి జిల్లాలో నేటితో నమోదయిన కరోనా కేసుల సంఖ్య ఇది. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా తీవ్రత తగ్గడానికి ప్రజలు ఎటువంటి నిబంధనలు పాటించడం లేదు. విచ్చల విడిగా రోడ్లపై తిరుగిస్తూ కరోనా తీవ్రతను పెంచుతున్నారు.

ప్రతి రోజు రెండువందల పైనే కేసులు

జిల్లాలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రతి రోజు పిహెచ్ సి పరిధిలో 50మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆస్పత్రులలో ఆర్టిపిసిఆర్ ద్వారా శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఆర్టిపిసిఆర్ కంటే ర్యాపిడ్ టెస్టుల ద్వారా ప్రతి రోజు రెండు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

మరిన్ని కేసులు పెరిగే అవకాశం

జిల్లాలో మరిన్ని కరోనా కేసులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాలో కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

బయట తిరుగుతున్న పాజిటివ్ వ్యక్తులు..?

ప్రతి 20 మందిలో ఒకరు కరోనా పాజిటివ్ ఉన్న వారు ఉన్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే జిల్లాలో వారికి తెలియకుండానే కరోనా ఉందని తెలియక చాలా మంది బయట తిరుగుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో ప్రతి పిహెచ్ సి పరిధిలో 50 మందికి కరోనా పరీక్షలు చేస్తే అందులో కనీసం 10 మందికి కరోనా పాజిటివ్ వస్తుంది. జిల్లాలో ఎలాంటి లక్షణాలు లేవని పరీక్షలు చేసుకొని వారు చాలా మంది ఉన్నారు. వారందరు పరీక్షలు చేసుకుంటే వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

ప్రజలు భయం వీడి పరీక్షలు చేసుకుంటేనే

కరోనా వస్తే మా పరిస్థితి ఏంటని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ భయాన్ని వీడి ప్రతి ఒక్కరు విధిగా పరీక్షలు నిర్వహించుకుంటే ప్రతి గ్రామంలో కరోనా కేసులు నమోదవుతాయి. దాంతో వారికున్న అనుమానాలు కూడా నివృత్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కరోనా వైరస్ ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్ ఎప్పుడు సోకుతుందోనని భయపడే కంటే విధిగా పరీక్షలు చేసుకుంటే ప్రజల్లో ధైర్యం పెంపొందే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

పది వేలకు చేరుతాయా

కామారెడ్డి జిల్లాలో కరోనా కేసులు 10 వేలకు చేరువవుతాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఆగస్ట్ నెలలోనే 4 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వెయ్యి లోపు ఉన్న కరోనా కేసులు ఆగస్ట్ చివరి నాటికి 5 వేలకు పైగా చేరాయి. దాంతో పాటు జిల్లాలో ప్రతి రోజు రెండు వందలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీన్ని బట్టి జిల్లా వ్యాప్తంగా 10 వేల వరకు కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

జాగ్రత్తలతోనే కరోనా కట్టడి

ప్రజలు స్వీయ నిర్బంధం పాటించి ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తే కరోనాను కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ప్రజలు అవసరం ఉన్నా లేకున్నా ప్రతి రోజు వందలాదిగా బయట తిరుగుతున్నారు. కొందరైతే మాస్కు అవసరమా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలన్న విషయాన్ని మరిచిపోయారు. దాంతో జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో అధికారులు కూడా చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. ప్రజలు ఇకనైనా నిబంధనలు పాటించి బయటకు రాకుండా ఇంటి వద్దనే ఉంటే కరోనాను కట్టడి చేయవచ్చు.

Related posts

టెంపుల్స్ లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయించండంటూ ఆదేశం

Satyam NEWS

కుమ్మరి సంఘం నేతను పరామర్శించిన నాగజ్యోతి

Satyam NEWS

విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా నడిపేన

Satyam NEWS

Leave a Comment