Slider కృష్ణ

తీరని ఆవేదన ఎవరితో చెప్పుకోలేక తనువు చాలించాడు

కృష్ణాజిల్లా గన్నవరం లో దారుణం జరిగింది. కుటుంబ భారం మోస్తున్న ఒక యువకుడు పోలీసు వలలో చిక్కి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకరమైన సంఘటన ఇది. అతడి పేరు చిట్టూరి మురళి. విజయవాడ లో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు.  చిన్నతనంలోనే తండ్రి మరణించటoతో  కుటుంబ భారం అతని మీదే పడింది. ఉదయం కాలేజ్ కి వెళ్లి చదువుకుంటూ రాత్రి పూట తన తల్లి ని తోడుగా తీసుకుని టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు అతడు. రాత్రి పూట టీ స్టాల్ నడుపుతూ కష్టపడి సంపాదించిన డబ్బుతో తన అక్క, చెల్లెలు పెళ్లి కూడా మురళి చేశాడు. అందరి తోనూ ఎంతో కలుపుగోలుగా ఉండే మనస్తత్వం ఉన్న వ్యక్తి మురళి. అయితే గత కొంత కాలం గా స్థానిక పోలీసులు అతడిని వేధిస్తున్నారు. చీటికి మాటికి పిలిచి వేధిస్తుండటంతో అతడు విసిగిపోయాడు. ఏం చేయాలో అర్ధం కాలేదు. చివరకు గన్నవరం లోని కోనాయి చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు వేధింపులకు మరో నిండు ప్రాణం బలి అయింది.

Related posts

13 రజబ్ పండుగ సందర్భంగా పాలు పండ్లు పంపిణీ

Satyam NEWS

సందీప్ కిషన్ లావణ్య త్రిపాఠి జోడీగా A1 ఎక్స్‌ప్రెస్‌

Satyam NEWS

అభివృద్ధికి అందరు అధికారులు సహకరించాలి

Satyam NEWS

Leave a Comment