29.7 C
Hyderabad
May 6, 2024 05: 05 AM
Slider ముఖ్యంశాలు

కఠిన నిబంధనలపై ఏపీలో ప్రధానోపాధ్యాయుల నిరసన

#school

రోజువారీ విధుల నిర్వహణలో ప్రభుత్వం విధిస్తున్న కొత్త కొత్త నిబంధనలపై ప్రధానోపాధ్యాయులు తమ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం వారు నూతన పంథాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు విడుదల చేసిన పత్రికా ప్రకటన యథాతధంగా ఇక్కడ ఇస్తున్నాం.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ ప్రధాన బాధ్యులకు విజ్ఞప్తి:

ఉన్నత పాఠశాలల రోజువారీ నిర్వహణలో మరియు ఇతర సంబంధిత వృత్తి పరమైన అంశాలలో ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 16 నుంచి  21 వరకూ పాఠశాలలకు హాజరవుతూ  నల్ల బాడ్జ్స్ ధరించి మనం తలపెట్టిన నిరసన ప్రదర్శన గురించి మీ మీ జిల్లాలో ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలిసేలా విరివిగా జిల్లాస్థాయిలో, డివిజన్ స్థాయిలో మరియు మండల స్థాయిలో కూడా వీలైన విధంగా సమావేశాలు నిర్వహించి మొత్తం అందరికీ సమాచారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని,ఏ రోజుకా రోజు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు   పూర్తిస్థాయిలో ప్రచారం కల్పించి ప్రింట్ మీడియా ద్వారా స్థానిక జిల్లా వార్తా పత్రికలలో వచ్చేటట్లు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మన సమస్యలు గురించి ప్రచారం బాగా జరిగేలా చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి,   మన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకునే విధంగా  నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసి  ప్రధానోపాధ్యాయుల ఐకమత్యాన్ని,సంఘటిత బలాన్ని చాటాలని కోరుతున్నాము.

జి.వి. నారాయణ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు

శ్రీనివాసరావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం.

Related posts

కాటేదాన్ పారిశ్రామిక వాడలో చిరుత పులి

Satyam NEWS

వ్యతిరేక తీర్పులు వస్తున్న నేపథ్యంలో…ఇలా..

Satyam NEWS

(Professional) Renin Lower Blood Pressure What Can Give You High Cholesterol

Bhavani

Leave a Comment