36.2 C
Hyderabad
May 15, 2024 15: 26 PM
Slider ఖమ్మం

నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై పోరాటాలు

#AISF

నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు పోరాటాలకు సిద్ధమవుతున్నామని AISF జాతీయ ఉాధ్యక్షులు రావి శివ రామకృష్ణ పిలుపునిచ్చారు స్థానిక ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో AISF ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ఈ సందర్భంగా రావి శివ రామకృష్ణ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో పుదిద్దుకుంటుందని ప్రముఖ విద్యావేత్త కొఠారి చెప్పారు కానీ మన దేశ విద్య భవిష్యత్తు ప్రపంచ బ్యాంకు రిలయన్స్ అదాని అంబానీ లాంటి ఒప్పందాల్లో వారి కన్సన్ధానంలో నడుస్తూ విద్యార్థులను సామ్రాజ్యవాదులుకు బానిసలుగా తయారు చేస్తున్నారని

ఆయన అన్నారు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యను కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ కాషాయకరణ చేయటానికి కుట్ర పొందుతున్నారని అయన మండిపడ్డారు ప్రముఖుల చరిత్రను డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల నుండి తొలగించి బ్రిటిష్ వారికి తొత్తుగా వ్యవహరించిన సావర్కర్ చరిత్రను చేర్చి దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు బాల్యం నుంచే విద్యార్థుల మెదడులోకి మతతత్వ భావజాలాన్ని నింపటం ఎంతవరకు సమంజసం అని ఆయన పేర్కొన్నారు జ్యోతిష్యం వాస్తు శాస్త్రం కోర్సులు పేర్లతో విద్యార్థులలో మూఢనమ్మకాలు పెంచి పోషిస్తున్నారని, విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయటానికి కామన్ ఎంట్రన్స్ టెస్టులు పేరుతో పేద మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల కేంద్రీయ విశ్వవిద్యాలయం త్రిబుల్ ఐటీ ఐఐఎం గిరిజన యూనివర్సిటీ లాంటి అనేక విద్యాసంస్థలను తెలంగాణలో నెలకొల్పకుండా తెలంగాణ విద్యార్థి లోకానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.

భారత దేశ విద్య వ్యవస్థకు చికిత్స చేసి దిశ నిర్దేశం చేయడానికి సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ ఒకటో వరకు బీహార్ రాష్ట్రంలోని బెగుసరై లో 30వ జాతీయ మహాసభలో నిర్వహించినట్లు ఈ మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికాల రామకృష్ణ జిల్లా నాయకులు సతీష్ సుకుమార్ నవీను వినయ్ గోపి నరేష్ ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు

Related posts

యువగళం సభతో ఉలిక్కిపడ్డ తాడేపల్లి ప్యాలెస్‌

Satyam NEWS

ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి

Satyam NEWS

కర్ణాటక ఫలితాలు బిజెపిమత రాజకీయాలకుచంపపెట్టు

Bhavani

Leave a Comment