25.2 C
Hyderabad
May 8, 2024 10: 33 AM
Slider గుంటూరు

ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం

nrt muslims 1

పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)కు వ్యతిరేకంగా ముస్లిం జే.ఏ.సీ.ఆధ్వర్యంలో శుక్రవారం నరసరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ, మానవహారం, ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పౌరసత్వానికి విఘాతం కలిగిస్తున్న బిల్లును వెంటనే రద్దు చేయాలని, NRC CAB ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు. ఈ ర్యాలీ లో MiM, CPI, CPM, జనసేన, టిడిపి, వైసీపీ, SC, ST, BC వివిధ రాజకీయ పార్టీల నాయకులు వందలాది మంది పాల్గొన్నారు.

దారి పొడవునా కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీ ముందుగా ఈద్గా గ్రౌండ్ షాదీ ఖానా నుండి ప్రకాష్ నగర్ మీదుగా బస్టాండ్ వద్ద ఉన్న ఓవర్ బ్రిడ్జి చేరుకుంది. అక్కడ నుంచి మల్లమ్మ సెంటర్ లో మానవహారం నిర్వహించి అనంతరం గాంధీ చౌక్ మీదుగా గడియారం స్తంభం వరకూ వెళ్లారు.

అక్కడ మానవహారం నిర్వహించారు. అనంతరం పల్నాడు బస్టాండ్, రెడ్డి కాలేజీ, పి.ఎన్.సి. కళాశాల మీదుగా వెళ్లి ఎన్.జి.ఓ.కాలనీ లోవున్న పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు ఇంటిని ముట్టడించారు. అనంతరం ఎంపీ ఇంటి వద్ద 2 గంటల సేపు ధర్నా నిర్వహించారు.

అనంతరం యంపీ ప్రతినిధినికి వినతిపత్రం అందజేశారు. తదుపరి ర్యాలీ స్టేషన్ రోడ్డుమీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు సాగింది అనంతరం ఆర్డీవో ఆఫీసు వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మోగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ సి.ఐ.బిలాలుద్దీన్, S.i.A.V. బ్రమ్మం , టూ టౌన్ సి.ఐ.కృష్ణయ్య ,S.I.రబ్బానీ ఖాన్ ల పర్యవేక్షణలో  పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Related posts

సురేష్ రెడ్డి కొవ్వూరి కి ‘మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డు

Satyam NEWS

ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ మౌనాన్ని అర్ధం చేసుకున్నాం

Satyam NEWS

రెండు కోరికలు తీర్చిన సీఎం జగన్ కు ధన్యవాదాలు

Bhavani

Leave a Comment