25.2 C
Hyderabad
May 8, 2024 07: 32 AM
Slider జాతీయం

బిజీ షెడ్యూల్:అలా వాళ్లిద్దరూ ఆఫీస్ లో ఒకటయ్యారు

america president trump waiting for india tour

ఆమె ఐపీఎస్ , అతను ఐఏఎస్ ర్వరి వృత్తిలో వారు బిజీ.ఎంత బిజీ అంటే వారికి పెళ్లి చేసుకునేందుకు కుడా టైం లేనంత.ఏదైతేనేం మొత్తానికి టైం లేక నో బిజీ షెడ్యూల్ వల్ల నో ఆఫీస్ లోనే మూడుముళ్ల బంధంతో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఈ ఘటన కోల్ కతాలో జరిగింది. పంజాబ్ కు చెందిన వరుడు తుషార్ సింగ్లా ఐఏఎస్ కు ఎంపికయ్యాడు.

ప్రస్తుతం ఉలుబేరియాలో ఎస్‌డిఓగా పనిచేస్తున్నాడు. ఇక వధువు నవజోత్ సిమి 2017 బ్యాచ్ బీహార్ కేడర్ ఐపిఎస్ అధికారి. నవజోత్ సిమి తుషార్ సింగ్లా కొన్ని రోజుల క్రితం నుంచి ప్రేమించుకుంటున్నారు. 2021లో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వల్ల తుషార్ సింగ్లా బిజీ అయ్యాడు. దీంతో చాలా సార్లు పెళ్లి వాయిదా పడింది. ఇక ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు.

పాట్నాలో ఉన్న నవజోత్ సిమి నిన్న లవర్స్ డే రోజున కోల్ కతాలోని తుషార్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ రిజిస్ట్రార్ ను పిలిచి సంతకాలు చేశారు. ఇద్దరు పెళ్లి బట్టలు ధరించారు. కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆఫీస్ బయట ఫోటోలకు పోజులిచ్చారు. అయితే పని ఎక్కువగా ఉండటం వల్ల ఇలా ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నామని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరికీ విందు ఇస్తామని చెప్పారు.

Related posts

సహాయ కార్యక్రమాల్లో జాప్యం వద్దు: సిఎం జగన్

Satyam NEWS

వర్క్‌స్పేస్ వర్చువలైజేషన్, హారిజన్ క్లౌడ్ పై వెబినార్

Satyam NEWS

సత్యం న్యూస్ ముందే చెప్పింది : నవంబరు 1న అవతరణ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment