42.2 C
Hyderabad
May 3, 2024 16: 13 PM
Slider ప్రపంచం

ఆర్గ్యుమెంట్: చైనా వస్తువులు కొనకపోతే ఇండియాకే నష్టం

#China Military tank

చైనా వస్తువులను బహిష్కరించాలని ఇండియాలో పెరుగుతున్న డిమాండ్ వివేకంలేని చర్యగా చైనా వాణిజ్య వర్గాలు అంటున్నాయి. ఇండియాలో అత్యంత చౌక ధరకు, అత్యంత నాణ్యమైన వస్తువును చైనా మాత్రమే ఇవ్వగలుగుతుందని అలాంటిది చైనా వస్తువులను బ్యాన్ చేస్తే ఇండియాకే నష్టం అని చైనీస్ వెబ్ సైట్ గ్లోబల్ టైమ్స్ తన విశ్లేషణలో పేర్కొంది.

 గాల్వాన్ లోయలో ఇండియా కవ్వింపు చర్యల వల్లే తోపులాట జరిగిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జోహో లిజియన్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి భారత భద్రతా దళాలు ఎల్ఏసీ పరిసర ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం వేగవంతం చేసిందని గాల్వాన్ లోయలో కూడా రోడ్లు, బ్రిడ్జిలు నిర్మిస్తున్నదని ఆయన తెలిపారు.

చాలా సందర్భాలలో చైనా ఈ నిర్మాణాలకు అడ్డు చెప్పిందని, అయినా వినకుండా భారత్ ముందుకు వెళ్లిందని ఆయన తెలిపారు. చైనా సరిహద్దుల్లోకి  భారత దళాలు మే 6న చొచ్చుకువచ్చాయని ఆయన వివరించారు. ఇరు దేశాల కమాండర్ స్థాయి చర్చలు జరిగినా ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ చర్యలు తీసుకోలేదని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఊ క్వైన్ అన్నారు.

ఆత్మరక్షణ కోసమే చైనా దాడి చేసింది

చైనా సేనలు చర్చల కోసం ముందుకు రాగానే భారత సేనలు దాడి చేశాయని ఆయన తెలిపారు. చైనా సేనలు ఆత్మరక్షణ కోసం పని చేశాయని ఆయన తెలిపారు. జరిగిన దానికి మొత్తం భారత్ దే బాధ్యత అని ఆయన అన్నారు. తప్పు చేసిన భారత్ తన దేశంలో దేశభక్తిని ఉపయోగించుకుని చైనా ఉత్పత్తులను నిషేధించాలని పిలువునిస్తున్నదని ఇది భారత్ కు మరింత నష్టం చేకూరుస్తుందని ఆయన అన్నారు.

చైనాలో ఇండియన్ మార్కెట్ చాలా చిన్నదని, అయితే చైనా మార్కెట్ ఇండియాలో ఎంతో పెద్దదని అందువల్ల చైనా ఉత్పత్తులను కొనకపోవడం భారత్ కే నష్టం తెస్తుందని ఒక వాణిజ్య రంగ నిపుణుడు అన్నట్లు గ్లోబల్ టైమ్స్ పోస్టు లో పేర్కొంది. 1962లో కూడా చైనాను భారత్ తక్కువగా అంచనా వేసుకున్నదాని లూ జింగ్ అనే బీజింగ్ లోని సోషల్ సైన్స్ పరిశోధకుడు అన్నారు.

1962 లోనూ చైనాను తక్కువ అంచనా వేశారు

అప్పుడు చైనాకు అమెరికాతో, రష్యాతో మంచి సంబంధాలు లేవని భారత్ అనుకున్నది. చైనా లో పేదరికం ఎక్కువగా ఉన్నది అని కూడా అప్పటిలో భారత్ అంచనా వేసి చైనా బలహీనంగా ఉన్నదని భావించి దెబ్బ తీసేందుకు ప్రయత్నించిందని లూ అన్నాడు.

భారత్ అమెరికాతో మంచిగా ఉంటే వారి ఆయుధాలు కొనుక్కోవాల్సి ఉంటుంది, అదే చైనాతో మంచిగా ఉంటే అనేక రకాల వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. కరోనా వైరస్ కారణంగా చైనా బలహీనపడిందని తప్పుడు అంచనాలు వేసుకోవద్దని ఆయన భారత్ కు చెప్పారు.

Related posts

ఒవైసీ బ్రదర్స్ వచ్చినా బీజేపీ గెలుపును ఆపలేరు

Satyam NEWS

యుద్ధ ప్రాతిపదికన అంబర్పేట్ లో అభివృద్ధి పనులు

Satyam NEWS

సినీ నటుడు మోహన్‌బాబు ఇంటి వద్ద కలకలం

Satyam NEWS

Leave a Comment