29.7 C
Hyderabad
May 1, 2024 05: 04 AM
Slider నిజామాబాద్

ఒవైసీ బ్రదర్స్ వచ్చినా బీజేపీ గెలుపును ఆపలేరు

#katipalli

కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం ఒవైసీ బ్రదర్స్ ను తెచ్చుకున్నా బీజేపీ గెలుపును ఆపలేరని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి నవగ్రహాలలో ఉన్న ఓ గ్రహం వర్గం వారికి దొంగ ఓట్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అది జరగదని తెలిపారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కెవిఆర్ మాట్లాడుతూ..  కామారెడ్డిలో తాగునీటి పైపులైన్ మరమ్మత్తుల కోసం 195 కోట్లు ఇవ్వగానే నిధుల వరద వస్తుందని బీఆర్ఎస్ నవగ్రహాలు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.

అసలు 9 ఏళ్లుగా కామారెడ్డిలో తాగునీటి సమస్య, పైప్ లైన్ సమస్య ఎమ్మెల్యేకు కనపడలేదా అని ప్రశ్నించారు. ఇన్నేళ్ళుగా ఇవ్వని నిధులు కేసీఆర్ ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. రాత్రికి రాత్రి ఒక్క చింతమడక గ్రామానికే 2 వేల కోట్లు కేసీఆర్ కేటాయించారని, కామారెడ్డిలో 96 గ్రామాలకు ఎన్ని వేల కోట్లు తెస్తారో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్పాలన్నారు. ఇన్నాళ్లు గంప గోవర్ధన్ కు చేతకాక తీసుకురాలేదా.. లేక అడిగినా కేసీఆర్ ఇవ్వలేదా అన్నారు. ఇన్నేళ్ళుగా ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు ఇవ్వడంతో నిధులు తేలేక చరిత్ర హినుడిగా మిగులుతానని ఎమ్మెల్యేకు అనిపించలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గంప పరిస్థితి ఏ నాయకునికి రావద్దని, మాట్లాడకపోతే చేతకాని వాడు అంటారేమోనని, మాట్లాడితే అధినేత ఏం అంటారోనని.. ఏం మాట్లాడలేని దయనీయ స్థితిలో ఎమ్మెల్యే ఉండిపోయారన్నారు.

మాస్టర్ ప్లాన్ రద్దయింది అంటూనే కొత్త రోడ్లకు మంజూరు ఇస్తున్నారని, భూములు కోల్పోతున్న రైతులు ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ ఆటలు గజ్వేల్ లో సాగవనే కామారెడ్డికి వస్తున్నారని, కామారెడ్డిలో కూడా కెసిఆర్ ఆటలు సాగనివ్వమన్నారు. చింతమడక చిట్టా తమ వద్ద ఉందన్నారు. కామారెడ్డిలో 200 కోట్ల మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారని, ఇప్పటికే 20 కోట్ల మద్యం డంప్ చేశారని ఆరోపించారు. కామారెడ్డిలో ఉన్న నవగ్రహల్లో ఒక గ్రహానికి చెందిన ఒకవర్గం ఓట్లను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో కోట్ల రూపాయల పంపిణీ చేయడానికి ఓ సినీ నిర్మాతకు అప్పజెప్పారని, ఆ నిర్మాత వీపు పగలడం ఖాయమని హెచ్చరించారు.

ఐజీ స్థాయి పోలీస్ అధికారి 15 రోజుల క్రితం కామారెడ్డి వచ్చి సర్వే చేసుకుని వెళ్లారన్నారు. లీడర్లు, ఇతర వ్యక్తులు ఎక్కడ ఉండాలో, ఎలాంటి భవనాలు కావాలో చూసుకుని వెళ్లారని తెలిపారు. సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తూ ముఖ్యమంత్రి కుర్చీకి మచ్చ తెస్తున్నారన్నారు. ‘కేసీఆర్ కామారెడ్డి రావాలి.. ఇక్కడి నుంచే పోటీ చేయాలి.. మేము ఓడించాలి.. ఇది మా కల’ అని పేర్కొన్నారు. కేసీఆర్ కు వీడ్కోలు ఇచ్చే సమయం అయిందని, కామారెడ్డి ప్రజలు శాశ్వతంగా రాజకీయ వీడ్కోలు ఇవ్వబోతున్నారన్నారు. కేసీఆర్ ఎన్ని కుయుక్తులు పన్నినా ఇక్కడ బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ పై మహిళా ఎంపీపీ ఫైర్

Bhavani

కౌలాస్ నాలా ప్రాజెక్టు లో పడి ఒకరు గల్లంతు

Satyam NEWS

పికా సిండ్రోమ్:జాన్సన్ అండ్ జాన్సన్ లెసా హైలెస్సా

Satyam NEWS

Leave a Comment