Slider జాతీయం

కరోనా కుచ్ కరోనా: మందుబాబులకు ఇది దుర్వార్త

wines shop

కరోనా లాక్ డౌన్ నుంచి షాపులకు మినహాయింపు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మందు షాపులకు మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు కూడా బార్ లు వైన్ షాపులు తెరిచే అవకాశం కలగడం లేదు. దేశంలోని గ్రీన్ జోన్ లలో కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఆదేశాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని అన్ని దుకాణాలను తెరిచి ఉంచవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాలలోని షాపింగ్ మాల్స్ పై నిషేధం కొనసాగుతూనే ఉంది. పట్టణ ప్రాంతాలలో నివాస ప్రాంతాలలో, వాటికి సమీపంలో ఉన్న ఇండిపెండెంటు షాపులు తెరుచుకుని వ్యాపారం చేసుకోవచ్చు. మార్కెట్ లు మార్కెట్ కాంప్లెక్సులు అందులో ఉన్న షాపులు తెరిచేందుకు వీలు లేదు.

ఈ కామర్స్ కంపెనీలు అత్యవసర వస్తువులను సరఫరా చేసేందుకు అనుమతించారు. హాట్ స్పాట్లు, కంటైన్ మెంట్ జోన్ లలో షాపులు తెరిచేందుకు వీలు లేదు. వీటన్నింటితో బాటు ఎక్కడా కూడా వైన్స్ షాపులు తెరవడానికి వీల్లేదు. మద్యం అమ్మకాలపై నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Related posts

గజ వాహనంపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి

Satyam NEWS

4 న రెండవ ఏఎన్ఎం ల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి

Bhavani

నిర్మల్ పోలీసు కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవం

Satyam NEWS

Leave a Comment