37.2 C
Hyderabad
May 1, 2024 12: 01 PM
Slider ఖమ్మం

4 న రెండవ ఏఎన్ఎం ల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి

#ANMs

రాష్ట్రంలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లందరినీ షరతుగా రెగ్యులరేషన్ చేయాలని హేతుబద్ధంగా లేని నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎం ల యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగవ తేదీన సచివాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎం ల యూనియన్ రాష్ట్ర (ఏఐటీయూసీ) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామాంజనేయులు పిలుపునిచ్చారు.

ఖమ్మం లోని గిరిప్రసాద్ భవన్ లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మినారాయణ అధ్యక్షతన జరిగిన ఖమ్మం జిల్లా స్థాయి పీహెచ్ సి లీడర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న హెల్త్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపార్ట్మెంటల్ పరీక్షలు పెట్టి అందరినీ రెగ్యులర్ చేశారని, వారికి జిపిఎఫ్ ఎకౌంటులను కూడా మంజూరు చేశారని ఆమే తెలియజేశారు.

ఏప్రిల్ 30 2023న జీవో నెంబర్ 16 ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న 5554 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారని అదే మాదిరి గత 15 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఈ రెండో ఏఎన్ఎంలు కూడా బిఎస్ షరతుగా రెగ్యులర్ చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి 20 మార్కుల వెయిటేజీ ఇచ్చి ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి అదే 20 మార్కులు ఇవ్వటమేంటని అయన ప్రశ్నించారు.

2018లో ఇచ్చిన నోటిఫికేషన్ లో 30 మార్కులను వెయిటేజీగా ఇచ్చి ఇప్పుడు 20 కి కుదించటం దారుణమైన విషయం అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులపై అధికమైన పనిభారం ఉన్న సంగతి హరీష్ రావుకు తెలిసినా తెలియనట్టు ఉంటున్నాడని అయన విమర్శించారు. క్రమబద్ధీకరణ విషయమై ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు మంత్రులు పట్టించుకోకపోవడం వల్లనే విసిగిన ఏఎన్ఎంలు సచివాలయం ముట్టడి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

15 సంవత్సరాలుగా ప్రభుత్వం కింద పనిచేస్తున్న వారు పని ఒత్తిడి వలన పరీక్షలకు సంసిద్ధం అవ్వలేరు కనుక వెంటనే ఈ విషయంపై స్పందించి ఆంధ్రాలో పెట్టిన మాదిరి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టి అందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని అయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాసార్ల హేమలత, అంబటి శైలజ, పోసం రాజేశ్వరి, ఎడం నాగరాణి, శీలపు దయమణి, కొత్తపల్లి పద్మావతి, సిరికొండ గొప్పమ్మా తదితరులు పాల్గొన్నారు.

Related posts

కంటివెలుగు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

Bhavani

ఈ నెల 10న 12వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Satyam NEWS

జనగామ జిల్లాలో ప్రతి ఇంటికి భగీరథ నీరు

Satyam NEWS

Leave a Comment