31.2 C
Hyderabad
May 2, 2024 23: 36 PM
Slider ప్రత్యేకం

ఈ ఒక్కరోజే తెలంగాణలో 10 కరోనా కేసులు

kcr 271

తెలంగాణలో ఇప్పటివరకు 59మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. వీరిలో ఒకరు కోలుకొని డిశ్చార్జి కాగా 58 మందికి చికిత్స జరుగుతోందని వెల్లడించారు. శుక్రవారం సీఎస్‌, డీజీపీతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘మరో 20వేల మంది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నారు. వీళ్ల గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. ఈ రోజు ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ప్రజలకు ధన్యవాదాలు. మంచి సహకారం అందిస్తున్నారు. ఇది కూడా మనం చేయలేకపోతే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉండేది.

లాక్‌డౌన్‌ చేసి, కర్ఫ్యూ పెట్టినా పది కేసులు వచ్చాయంటే దీని పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఎంత భయంకరమైన వ్యాధో.. అర్థం చేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే అంత సులభంగా నివారించవచ్చు’’ అని వివరించారు. ప్రపంచంలో దీనికి మందు లేదు, ప్రపంచ దేశాలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.

దీనిని అరికట్టేందుకు స్వీయనియంత్రణ పాటించాలి. అమెరికా లాంటి దేశం కూడా ఈ వ్యాధి తో అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని అంటే సోషల్ డిస్టన్స్ మాత్రమే. అమెరికా, స్పెయిన్, ఇటలీ స్థాయి లో ఇండియాలో  వస్తే 20 కోట్ల మంది వ్యాధి బారిన పడుతారని కేసీఆర్ అన్నారు.

1400 ఐసియు బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఇవి అన్ని కూడా గచ్చిబౌలి స్టేడియంలో సిద్ధం అవుతున్నాయని ఆయన తెలిపారు. వెంటిలేటర్ లు కూడా 500 ఆర్డర్ ఇచ్చాము.11500 మంది ఐసో లేషన్ లో ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

సుమారు 60 వేల మందికి ఈ వైరస్ సోకిన వారికి కూడా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం అని ఆయన ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలికి గురికావద్దు. ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రం కు వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు.

హౌస్ బిల్డింగ్ కాకుండా ఇరిగేషన్ లో ,రైస్ మిల్ లలో కూడా ఎక్కడి నుండో వచ్చి పని చేస్తారు. వారికి మేము విజ్ఞప్తి చేశాం వారికి కూలీలు ఇవ్వాలని,అన్నం కూడా పెట్టాలని చెప్పారు. అంతేకాదు మున్సిపల్ మంత్రి తో క్రేడ్డాయ్ వాళ్ళు కలిసి అన్నివిధాలా ఆదుకుంటాం అన్నారు.

కలెక్టర్ లకు కూడా చెప్తున్నా అందరిని ఆదుకోవాలని కోరుతున్న. ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్న కార్పోరేషన్ లలో చాలా మంది కూలీలు ఉన్నారు వారికి అందరికి అండగా ఉండాలి కోరుతున్నాం అని కేసీఆర్ అన్నారు.

Related posts

మరో మగాడితో అక్రమ సంబంధమే హత్యకు కారణం

Satyam NEWS

యూత్ కాంగ్రెస్ నాయకుడికి రంగినేని పరామర్శ

Satyam NEWS

విద్యా శాఖ మంత్రిచే సత్కారం అందుకున్న మధుసూదన శర్మ

Satyam NEWS

Leave a Comment