38.2 C
Hyderabad
May 2, 2024 22: 59 PM
Slider ముఖ్యంశాలు

విద్యా శాఖ మంత్రిచే సత్కారం అందుకున్న మధుసూదన శర్మ

#worldwaterday

శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ సంస్థ  ఆధ్వర్యములో ప్రముఖ కవి దంపతులు వీణా హనుమంతరెడ్డి పుస్తకావిష్కరణ సభ జరిగింది. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదివారం రాత్రి నిర్వహించిన కవిసమ్మేళనంలో పాల్గొని  కవితాగానం చేసినందుకు, కొల్లాపూర్ మండలం  ఎనమనబెట్ల గ్రామానికి చెందిన కవి,రచయిత,తెలు భాషోపాధ్యాయులు వేదార్థం మధుసూదన శర్మ  తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి నుంచి సత్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు నందిని సిద్దారెడ్డి, రంగాచార్య, టి.గౌరీ శంకర్, డా.వెళుదండ సత్యనారాయణ, పెద్దూరి వెంకట దాస్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే ప్రపంచ నీటి వారోత్సవాల సందర్బంగా హైదరాబాద్ జలమండలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన మరో కవి సమ్మేళనంలో పాల్గొని, భూగర్భ జలాలను పరిరరక్షించేందుకు ఉద్యమస్ఫూర్తిగా ప్రజలు ఎలా కదలాలి? అనే కవితను చదివి,వినిపించినందుకు హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ హరిశంకర్ తదితరులు మధుసూధన శర్మ ను సత్కరించారు. ఒకే రోజు రెండు సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని సత్కరం అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని మధుసూధన శర్మ అన్నారు.

Related posts

ఆస్ట్రేలియాలో మహానేత కెసిఆర్ హరిత జన్మదిన వేడుకలు

Satyam NEWS

మెగా పవర్ స్టార్ కు చేరిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

Satyam NEWS

ఇసుకతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు

Satyam NEWS

Leave a Comment