38.2 C
Hyderabad
April 28, 2024 19: 29 PM
Slider పశ్చిమగోదావరి

అర్చకులకు 100% వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు

#kottusatyanarayana

దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని  వివిధ దేవాలయాలో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు ఏదైనా కారణం చేత అనారోగ్యం బారిని పడినప్పుడు వైద్యం కోసం చేసిన ఖర్చులో ప్రస్తుతం అర్చక సంక్షేమ నిధి నుంచి 50% వరకు మాత్రమే చెల్లించడం జరుగుతుంది.  వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వం, ఇనాం భూముల పైన వంతుల వారీగా, ధూప దీప నైవేద్యం పథకం కింద, నెలసరి వేతనం పై పనిచేస్తున్న అర్చకులందరికి ఇకపై నూరు శాతం (100%) వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపులు చేయటం జరుగుతుందని ఉపముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

ప్యానల్ డాక్టర్ నిబంధనలు మేరకు సూచించిన మొత్తం ఖర్చును  చెల్లించే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి అన్నారు. దీనిని తక్షణమే అమలులోకి తీసుకువచ్చేలా అధికారులను  ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. ఇటీవల ప్రారంభించిన  అర్చక మరియు,ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ఆన్లైన్ వెబ్ సైట్ www.aparchakawelfare.org ద్వారా అర్జీలు నమోదు చేసుకోవచ్చునని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Related posts

నల్గొండ డీసీసీబీ వైస్ చైర్మన్ విరాళం రూ.లక్ష

Satyam NEWS

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ల పేర్లు ఖరారు

Satyam NEWS

ఆహా’లో సమంత అక్కినేని టాక్‌ షో ‘సామ్‌ జామ్‌’

Satyam NEWS

Leave a Comment