38.2 C
Hyderabad
April 29, 2024 19: 08 PM
Slider నిజామాబాద్

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కెసిఆర్ జైలుకే

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కెసిఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావుకు మద్దతుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బిచ్కుందలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు.

ఇక్కడున్న బిఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షిండే, పోచారం శ్రీనివాస్ రెడ్డితో కుమ్ముకై మంజీరా లో ఉన్న ఇసుకను దోచుకొని కోట్లు గడయించి కర్ణాటక,మహారాష్ట్రలో భూముల కొనుగోలు చేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. దళితున్ని సీఎం చేస్తామని దళితులను మోసం చేశారని కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. రైతుబంధుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న కేసీఆర్ దళిత బంధు పథకం కొనసాగింపుకు అనుమతి ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు.కెసిఆర్ తీరు పూర్తిగా దళితులకు వ్యతిరేకంగా కొనసాగుతున్నదని, దళితులు కేసీఆర్ను బొంద పెట్టే పనిలో ఉండాలన్నారు.

దళితులకు మూడెకరాల భూమి లేదు, కేజీ టు పీజీ విద్య లేదు ,మైనార్టీ 12% లేదు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు లేవు, ఇంటికో ఉద్యోగం లేదు,10 ఏండ్ల నుండి నుండి లేండి ప్రాజెక్టు పూర్తి కాలేదు, కానీ వారి కుటుంబం మొత్తం లక్షల కోట్లు అక్రమార్జన చేశారని, హైదరాబాదులో వందల ఎకరా భూములు కబ్జా చేశారని ఆరోపించారు. రేపటినుండి దళితులు కేసీఆర్ దిష్టిబొమ్మను అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తగలబెట్టాలని పిలుపునిచ్చారు. వీటన్నిటిని నియంతల పరిపాలిస్తున్న కేసీఆర్ను గద్దె దించాలని, నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాకన్న ముందు పలువురు వక్తలు మాట్లాడారు. సభస్థలికి ఆయన రాగానే గజమాలతో ఆయనకు సత్కరించారు.

భారీ స్థాయిలో ప్రజలు ఈ బహిరంగ సభకు రావడంతో మైదానం జై కాంగ్రెస్ నినాదాలతో మారుమోగింది. ముగింపులో కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి అంటూ భారీ వినదలతో సభస్థలి హోరెత్తింది. చివరన బాయ్ బాయ్ కెసిఆర్ బాయ్ బాయ్ కెసిఆర్ అని సభను ముగించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కెర్, మాజీ జెడ్పిటిసి సభ్యులు కమల్ కిశోర్, సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప సెట్కార్, పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి, నాగనాథ్, రమేష్ దేశాయి ,ధర్పల్లి గంగాధర్, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, మైనార్టీ సీనియర్ నాయకులు పాషా సెట్, సుధీర్ చోప్రా, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

కోమటిరెడ్డీ… రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటున్నావ్

Satyam NEWS

జమిలి ఎన్నికలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు

Satyam NEWS

టిఆర్ఎస్ తాలూకా యూత్ అధ్యక్షుడిగా అమర్ నాథ్

Satyam NEWS

Leave a Comment