40.2 C
Hyderabad
May 6, 2024 17: 56 PM
Slider హైదరాబాద్

గ్రేట‌ర్ బ‌రిలో 1121 అభ్య‌ర్థులు

ghmc-elecftions

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో నామినేషన్ల విత్ డ్రా తర్వాత గ్రేటర్ బరిలో 1121 మంది అభ్యర్థులు మిగిలారు. మొత్తం 150 వార్డులకు 2,575 నామినేషన్లు దాఖలయ్యాయి. 1893 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. విత్ డ్రా గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను ఈసీ ప్ర‌క‌టించింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దాదాపుగా అన్ని డివిజన్లలో అభ్యర్థులను నిలిపాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిసి 500 మందికిపైగా పోటీలో ఉన్నారు.

20-20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను త‌ల‌పించ‌నున్నఎన్నిక‌లు

కాగా అభ్య‌ర్థుల విష‌యంలో అన్ని పార్టీలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఊగిస‌లాట‌ను ప్ర‌ద‌ర్శించ‌గా.. ఆయా చోట్ల బ‌ల‌మున్న నేత‌లు కూడా స‌సేమిరా పార్టీ అధిష్టానాల నిర్ణ‌యాన్ని అంగీక‌రించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ప‌లుచోట్ల ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌గా, ప‌లువురు బుజ్జ‌గింపుల‌తో స‌రిపెట్టుకున్నారు. మ‌రికొంత‌మంది మాత్రం ఇంకా పోటీ నుంచి త‌ప్పుకోకుండా తాము విజ‌యం సాధిస్తామ‌న్న ధీమాలో ఉన్నారు. ఏది ఏమైనా ఈసారి జ‌ర‌గ‌బోఏ జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు 20-20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను త‌ల‌పిస్తాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయా పార్టీలు ఒక‌రిమీద ఒక‌రు కారాలు, మిరియాలు నూరుకుంటుండ‌గా, ఇంకొంత మంది మ‌రో అడుగు ముందుకేసి ఏకంగా ఆయా వ్య‌క్తుల‌పైనే డైరెక్ట్ అటాక్‌లు చేస్తున్నారు.

Related posts

సచివాలయం మూతపడేలా చేసినా చర్యలు తీసుకోరేం?

Satyam NEWS

ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటా

Satyam NEWS

హైదరాబాద్‌ను ఏ కులం చూసి అభివృద్ధి చేశాం?

Satyam NEWS

Leave a Comment