28.7 C
Hyderabad
April 26, 2024 10: 13 AM
Slider ఆధ్యాత్మికం

తండ్రి ఆశ‌యం మేర‌కు ద్వాద‌శ జ్యోతిర్లింగాల ప్రతిష్ట

#Pasupatinath Temple

ఉత్త‌రాదిలో ప‌శుప‌తి నాథ్ గా కొలువై ఉన్న ఆ కేదారీశ్వ‌రుడు ద‌క్షిణాదిలోనూ భ‌క్తుల‌కు దర్శ‌న‌మిస్తున్నాడు. అదే ఉత్త‌రాంద్ర‌లోని విజ‌య‌న‌గ‌రం ఎస్వీఎన్ న‌గ‌ర్ లోని ప‌శుప‌తి నాథ్ దేవాల‌యం. సుమారు ప‌దహారేళ్ల‌ క్రితం ఈ స్ప‌టిక లింగాకారం‌ శివుడు ప్రతిష్టితమయ్యాడు.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకడైన పశుపతి నాధుడు ప్రస్తుతం కార్తీక మాసంలో మరింత వైభవంగా పూజలందుకుంటున్నాడు. కార్తీకమాసం సందర్భంగా ఆల‌య విశిష్ట‌త,  స్థ‌ల పురాణం గురించి ఒక్క‌సారి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

తండ్రి ఆశ‌యం కోసం త‌న‌యులు 2007 సెప్టంబ‌ర్ 16 వ తేదీన ఇక్కడ జ్యోతిర్లింగాలు ప్ర‌తిష్టాన చేశారు. అందుకు మూడేళ్ల క్రితం జ్ఙాన స‌ర‌స్వ‌తి ఆల‌య నిర్మాణం కూడా పూర్తి చేశారు. జ్ఙాన స‌ర‌స్వ‌తి ఆల‌య నిర్మించిన‌ప్పుడే గుడిశా వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న క‌ల‌ను, కోరిక‌ను…త‌న సంతాన‌మైన కొడుకులు,కూతురుకు చెప్పారు.

అప్ప‌టికే జ్ఙాన స‌ర‌స్వ‌తి ఆల‌య నిర్మాణం జ‌ర‌గడంతో…ఆ ప‌క్క‌నే ఉన్న స్థ‌లంలో స్ప‌టిక లింగం, జ్యోతిర్లింగాల ప్ర‌తిష్ట‌తో ప‌శుప‌తినాథ్ దేవాల‌యం నిర్మించ‌లని సంకల్పించుకున్నారు. అయితే వెంక‌టేశ్వ‌ర‌రావు స‌తీమ‌ణి అర్ధాంత‌రంగా కాలం చెంద‌డంతో..వెంక‌టేశ్వ‌రరావు ప్రాణం పోయినంత ప‌ని అయి పోయి…త‌న చింత‌న‌న‌ను పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికత వైపు మ‌ళ్లించారు.

అప్ప‌టికే విజ‌య‌న‌గ‌రంలోని మూడు లాంత‌ర్ల వ‌ద్ద తన సంతానం పేరుతో ఎస్వీఎన్ ఆఫ్టిక‌ల్స్ స్టోర్ పెట్టి…త‌న ఇద్ద‌రు కొడుకుల‌ను అందులో ప్రావీణ్యం పొందేలా తండ్రిగా బాద్య‌త‌గా వ్య‌వ‌హిరించారు. ఇక‌ తండ్రి వెంక‌టేశ్వ‌ర‌రావు ఆశ‌యాల‌కు త‌గ్గ‌ట్టుగానే కొడుకులు శ్రీనివాసరావు, నాగేశ్వ‌ర‌రావులు ఎదిగి అటు వ్యాపార రంగంలో రాణించడమే కాకుండా ఇటు ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రవేశించారు.

ఈ నేప‌ధ్యంలోనే ఎస్వీఎన్ న‌గ‌రంలో ప‌శుప‌తి నాథ్ టెంపుల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు కోసం… డేహ‌రాడూన్, బాస‌ర‌ల‌ను సంద‌ర్శించి అక్క‌డే కొద్ది రోజులు ఉండి  ఆక్క‌డ స్థ‌ల‌పురాణాలు పూర్తిగా తెలుసుకుని…త‌ద‌నుగుణంగా అంత దూరం భ‌క్తులు వెళ్ల‌కుండానే విజ‌య‌న‌గ‌రంలోనే ఆ రెండింటిని ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.

దాదాపు 30 మందికి పైగా సిబ్బంది ని ఏర్పాటు చేసి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తున్నారు. ఈ ఆధ్మాతిక,ధార్మిక చ‌ర్య‌ల‌న్నీ2004లో ఏర్పాటు చేసిన  శార‌దా సేవా సంఘం అనే సంస్థ‌ ద్వారా కొనసాగిస్తున్నారు.

ప్రతి ఏడాది కార్తీక మాసంలో…విశేష పూజ‌లు ఇక్కడ నిర్వహిస్తారు. ప‌శుప‌తి  నాథ్ దేవాల‌యంలో ప్ర‌తీ రోజూ సాయంకాలం..హార‌తి కార్య‌క్ర‌మం నిర్వహించడం ఆన‌వాయితీగా వ‌స్తోంది. టిక్కట్ లేకుండా స్ప‌టిక లింగం ద‌ర్శ‌నం చేసుకునే ఏకైన ఆలయం ప‌శుప‌తి నాథ్ దేవాల‌యం ఎస్వీఎన్ న‌గ‌ర్ దేవాలయం.

శార‌దా సేవా సంఘం అధ్య‌క్షుడు చెణుకూరి శ్రీథ‌ర్, కార్య‌ద‌ర్శి శ్రీనివాస‌రావులు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని వీటిని నిర్వహిస్తున్నారు.

భరత్, సత్యం న్యూస్, విజయనగరం

Related posts

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం: ఒకరి మృతి

Satyam NEWS

కేంద్ర మాజీ మంత్రి అశోక్ ఇంటి వద్ద టెన్షన్… టెన్షన్…

Satyam NEWS

మెగా సినిమాలు ఒకేరోజు రీ రిలీజ్ చేయకూడదనుకున్నాం

Bhavani

Leave a Comment