31.7 C
Hyderabad
May 6, 2024 23: 30 PM
Slider ప్రత్యేకం

చంద్రబాబు అరెస్టు తర్వాత 120 మంది చనిపోయారు

#balakotaiah

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  నాలుగున్నరేళ్ళ పరిపాలనా వైఫల్యాలతో ప్రజలపై అరాచకాలు మితిమీరి  పోయాయని, దౌర్జన్యాలు , హత్యలు,చావులు మాత్రమే మిగిలాయని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు.  మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ జిల్లా పద్మనాభం స్టేషన్ పోలీసులు బాందేవపురం పాపు అనే దళిత యువకుడిని  కోళ్ళ దొంగతనం  కేసులో విచారించేందుకు తీసుకువచ్చి కాళ్ళు ఇరగొట్టారని, వారిని విధుల నుంచి పూర్తిగా డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసులే జె బ్రాండ్ మద్యం సేవించి థర్డ్ డిగ్రీ అమలు చేశారంటే,  ఏపీ పోలీసుకు వైసీపీ పిచ్చి ముదిరిందని అన్నారు.  ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి కి చెందిన గంధం నరేంద్ర అనే కానిస్టేబుల్ పై జగన్నన్న సైన్యానికి చెందిన వైసిపి మూకలు దాడి చేసి చంపేశారని తెలిపారు. ఇద్దరు బిడ్డలకు తండ్రి లేకుండా చేశారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 120 మంది అసువులు బాసారని, చంద్రబాబు విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ  పోయే ప్రాణాల సంఖ్య పెరుగుతూనే ఉంటుందని పేర్కొన్నారు.

రాజమండ్రిలో జరిగిన భువనేశ్వరి దేవి సత్యమేవ జయతే దీక్షలో పాల్గొని, రాజమండ్రి సెంట్రల్ జైలును పరిశీలించేందుకు తాను వెళ్లానని,  జైలు లోపల కంటే, జైలు బయట పెద్ద ఎత్తున పోలీసుల వలయం ఏర్పాటు చేశారన్నారు. రహదారిని బ్లాక్ చేసి, వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నట్లు చెప్పారు. సిసి కెమెరాలు పెట్టి, చీమ చిట్టుక్కు మన్నా వెంటాడుతున్నారని తెలిపారు. రామదాసును బంధిఖానాలో బంధించిన తానీషా కూడా ఇలాంటి పహారా పెట్టి ఉండక పోవచ్చు అని అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వానికి మహాత్మా గాంధీ బొమ్మలకు దండలు వేసే అర్హత లేదని, గాంధీని చంపిన గాడ్సే బొమ్మలను పూజిస్తే మంచిదని బాలకోటయ్య  ప్రభుత్వానికి సూచించారు.

Related posts

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి పువ్వాడ

Bhavani

రిక్వెస్ట్: కొల్లాపూర్ అభివృద్ధికి ఎల్లేని చొరవ

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు

Satyam NEWS

Leave a Comment