28.6 C
Hyderabad
September 20, 2020 13: 46 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో 12న గోకులాష్టమి ఆస్థానం, 13న ఉట్లోత్సవం

#Tirumala Tirupathi

తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఈ నెల 12వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. 

శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు.

13వ తేదీన ఉట్లోత్సవం

అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. ఆగస్టు 13న తిరుమలలో ఉట్లోత్సవాన్ని పుర‌స్క‌రించ‌కుని సాయంత్రం 4 నుండి 6 గంటల వర‌కు శ్రీమలయప్పస్వామి వారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

ప్ర‌తి ఏడాది తిరుమ‌లలో ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ హార‌తులు స్వీక‌రిస్తారు.

యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. కానీ ఈ ఏడాది  కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. 

Related posts

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

హమారామన్ కీ బాత్ : రాజధానిగా అమరావతి:ప్రధానికి ఫోన్ కాల్స్

Satyam NEWS

గడ్డి గాడిదకు వేస్తే బర్రె పాలిస్తుందా?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!