తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ రవిప్రకాశ్ మాట వినిపించబోతున్నది. టివి9 స్థాపించి ఎలక్ట్రానిక్ మీడియాకు దిశానిర్దేశం చేసిన రవిప్రకాశ్ అక్రమ కేసుల్లో ఇరుక్కుని టివి9 నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాయంతో టివి9 కొత్త యజమానులు చాలా కాలంగా రవి ప్రకాశ్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇటీవల రవిప్రకాశ్ ను అరెస్టు కూడా చేశారు. బెయిల్ పై బయటకు వచ్చిన రవిప్రకాశ్ తన దైన శైలిలో మళ్లీ పావులు కదిపారు. మహాన్యూస్ ఎండీ వంశీకి 5 కోట్లు చెల్లించి రవిప్రకాశ్ ఆ ఛానెల్ ను టేకోవర్ చేయబోతున్నట్లు తెలిసింది. దాంతో త్వరలో మహన్యూస్ తెరపై రవి ప్రకాశ్ కనిపించబోతున్నాడు.
previous post
next post