మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన జరిగింది. ఎవరూ ఊహించని విధంగా స్కూటీ ఢీ కొని 14 నెలల బాలుడు మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికుడుగా పని చేస్తున్న రాజ్ కుమార్ తన మేనల్లుడిని ఎత్తుకుని జయభూరి సిలికాన్ టవర్స్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. అకస్మాత్తుగా మాదాపూర్ వైపు వెళుతున్న ఒక స్కూటీ వచ్చి అతడికి తగిలింది.
స్కూటీ ఢీ కొనడంతో చేతుల్లో ఉన్న ఆ 14 ఏళ్ల బాలుడు రాజ్ కుమార్ చేతుల నుంచి జారి రోడ్డు పై పడ్డాడు. 14 నెలల సతీష్ అనే ఆ పసి పిల్లవాడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజ్ కుమార్ ను చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. స్కూటీ నడిపిన వ్యక్తికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.