31.7 C
Hyderabad
May 7, 2024 01: 51 AM
Slider జాతీయం

ఆపరేషన్ గంగ ద్వారా 15,920 మంది భారతీయుల తరలింపు

#jyotiradityasindhia

ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  ‘ఆపరేషన్ గంగ’ ద్వారా ఇప్పటికి 15,920 మందిని భారత్ కు తీసుకొచ్చినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఉక్రేయిన్ లోని వేర్వేరు నగరాలలో ఉన్న వారు సరిహద్దులకు చేరుకుంటే అక్కడి నుంచి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల ద్వారా భారత ప్రభుత్వం వారిని తీసుకువస్తున్నది.

ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు 76 విమాన సర్వీసులను వినియోగించారు. రొమేనియా నుంచి 31 విమానాలలో 6,680 మందిని, పోలాండ్ నుంచి 13 విమానాలలో  2,822 మందిని, హంగేరి నుంచి 26 విమానాలలో 5,300 మందిని, స్లొవేకియా నుంచి 6 విమానాల్లో 1,118 మందిని భారత్ కు  చేర్చామని కేంద్ర మంత్రి వివరించారు.

ఆదివారం 11 ప్రత్యేక విమానాల్లో 2,135 మంది భారత పౌరులను ఉక్రెయిన్‌ నుంచి తరలించారు. ఫిబ్రవరి 22 నుండి 66 ప్రత్యేక పౌర విమానాల్లో 13,852 మంది భారతీయులను స్వదేశం చేర్చారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఆదివారం మూడు ప్రత్యేక విమానాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 214 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు.

వారిలో ఏపి కి చెందిన వారు 109 మంది, తెలంగాణ కు చెందిన వారు 105 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఎఎఫ్‌) విమానాల ద్వారా ఆయా దేశాలకు 26 టన్నుల రిలీఫ్‌ లోడ్‌ను తీసుకెళ్లి, 2056 మంది ప్రయాణికులను వెనక్కి తీసుకొచ్చారు. 

సోమవారం బుడాపెస్ట్‌ (5), సుసెవా (2), బుకారెస్ట్‌ (1) నుండి 1,500 మందికి పైగా భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి 8 ప్రత్యేక విమానాలు రానున్నాయి. ఉక్రెయిన్ లో ఇంకా చిక్కుకుని ఉన్న వారిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ఆదివారం భారత ప్రభుత్వం తాజాగా మరోసారి అలెర్ట్ జారీ చేసింది. తక్షణం అక్కడ ఉన్న భారతీయులు అంతా తమ వివరాలతో ఒక గూగుల్ ఫారం  నింపాలని సూచిస్తూ ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.

Related posts

ఉప్పల ట్రస్ట్ సహకారంతో మూత్రశాల నిర్మాణం

Satyam NEWS

నిజాంసాగర్, అప్పర్ మానేరు శిఖం భూముల సర్వే

Satyam NEWS

Beware: రెమిడిస్వేర్ కరోనాకు సంజీవని కాదు

Satyam NEWS

Leave a Comment