29.7 C
Hyderabad
May 2, 2024 04: 27 AM
Slider హైదరాబాద్

భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసిఆర్ అహంకారాన్ని వీడాలి

#golnaka

డా.బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారాన్ని దించుతామని ఎంఏస్పీ, ఎంఆర్పీఏస్ అంబర్ పేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బడుగుల బాలకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్ లో ఏప్రిల్ 4వ తేదీ న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి మహాసభ జరుగుతుందని ఆయన అన్నారు. యూసుఫ్ గూడా సవేరా ఫంక్షన్ హాల్లో 8వ తేదీన సన్నాహక సదస్సు జరుగుతుందని అందులో అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని ఆయన కోరారు.

ఈ మేరకు అంబర్ పేట నియోజకవర్గం డాక్టర్ అంబేడ్కర్ శతాబ్ది భవన్ గోల్నాక లో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాలకృష్ణ మాదిగ మాట్లాడుతూ అంబేడ్కర్ వాదులు, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతీ ఒక్కరు మహాసభను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితులుగా విచ్చేసిన డాక్టర్ స్వామి అల్వాల్, అరుంధతీ చీఫ్ ఎడిటర్ ఎల్.ఏస్.రావు, దళిత నాయకులు సంగీతపు రాజలింగం మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన రాజ్యాంగాం భారతదేశ రాజ్యాంగంమని అన్నారు.

73 సంవత్సరాలుగా భారత దేశం సురక్షితంగా శాంతి యుతంగా దేశంలోకి అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అన విషయం కెసిఆర్ మరచి పోయిండు అని అన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడానికి రాజ్యాంగామే ప్రధాన ఆయుధమని లేకుంటే ఈ రోజు ఈ ప్రత్యేక రాష్టానికి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఏస్ జాతీయ నాయకులు ఎడవేల్లి యాదయ్య మాదిగ, కొయ్యడ రమేష్ మాదిగ, రజక  సంగం నాయకులు సంజీవ, గంగపుత్ర సంగం అడ్వేకేట్ రాజేష్, మహేందర్ గౌడ్, పల్లె రాజు, సంపత్, దాస్, నవీన్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

రాజమండ్రిలో నర్సు కుటుంబంపై పోలీసుల దౌర్జన్యం

Satyam NEWS

పార్టీ మార్పు కథనాలకు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ క్లారిటీ

Satyam NEWS

విశ్లేషణ: కోట్లున్న నేతలూ కోవిడ్ కు ఫండ్ ఇవ్వరూ?

Satyam NEWS

Leave a Comment