39.2 C
Hyderabad
May 3, 2024 14: 50 PM
Slider ఖమ్మం

18వేల కోట్ల రుణాలు

#ajay

సిఎం కెసిఆర్ పాల‌న‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చింది.  మ‌హిళ‌ల సాధికార‌త కోసం సిఎం కెసిఆర్ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారని, మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో మ‌హిళా ఆరోగ్య ప‌థ‌కాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసిన మహిళలకు తినిపించారు.బిలీఫ్ హాస్పిటల్స్ అధినేత మేడంపూడి రమాజ్యోతి అధ్వర్యంలో నాగార్జున ఫంక్షన్ హాల్ నందు జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గోన్నారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రహిత రుణాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మ‌హిళ‌ల అభివృద్ధితోనే దేశ ప్ర‌గ‌తి, పురోగ‌తి జ‌రుగుతుంది. దేశ‌లో ఎక్క‌డా లేని విధంగా డ్వాక్రా సంఘాల బ‌లోపేతం మ‌న రాష్ట్రంలోనే జ‌రిగిందన్నారు. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మహిళల ఆరోగ్యం కోసం అరోగ్య మహిళ, వడ్డీ రహిత రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషుడి కంటే ధీటుగా అన్ని రంగాల్లో విస్తృతంగా రాణిస్తున్నారని, మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఅర్ గారు మహిళలకు అన్ని రంగాల్లో ఉన్నత స్థానం కల్పించారని అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ఒక గొప్ప కానుక ఇచ్చిందని  అన్నారు.రూ.750 కోట్ల రూపాయల భారీ నిధులను ఆడబిడ్డల కోసం విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ప్రభుత్వానికి మహిళల తరుపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధుల‌లో 250 కోట్ల రూపాయ‌లు ప‌ట్ట‌ణ ప్రాంతాల మ‌హిళ‌ల కోసం కాగా, 500 కోట్లు గ్రామీణ మ‌హిళ‌ల కోస‌మ‌ని మంత్రి తెలిపారు. ఈ మొత్తం 750 కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్రంలో అటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల‌లో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ ఎత్తున లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలకు 10 ఏండ్లలో 21 వేల 978 కోట్లు రుణాలు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 8 ఏండ్ల‌ల్లో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా 66 వేల 624 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు రుణాలుగా ఇప్పించడం జరిగిందని వివ‌రించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం ఇప్పటివరకు వడ్డీలేని రుణాలుగా అర్హత కలిగిన 3 లక్షల 85 వేల 82 సంఘాలకు 2 వేల 561 కోట్ల 77 లక్షలు విడుదల చేసింది. దీని ద్వారా 46 లక్షల 20 వేల 984 సంఘ సభ్యులకు లాభం చేకూరింది. తెలంగాణ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల నిధులను పెద్ద ఎత్తున విడుదల చేశారన్నారు.

అసెంబ్లీ, కౌన్సిల్ వంటి చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అప్పటి ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, జాగృతి అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత అలుపెరగకుండా గత తొమ్మిదేళ్ళ కాలం నుంచి పోరాటం చేస్తున్నారన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తీర్మానాన్ని ఆమోదించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా అందజేశారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్స్ కోసం తమ పార్టీ ఎంపీలతో సహా కవిత, తాను కూడా అనేక సార్లు పార్లమెంట్ లో ప్రస్తావించామని తెలిపారు. ఈనెల 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో కవిత చేపట్టనున్న మహిళా రిజర్వేషన్ల దీక్షకు దేశంలోని మహిళలు సంపూర్ణ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

Related posts

న్యూ మ్యాంగ్ కుంఫు విద్యార్థులకు రాష్ట్ర మంత్రి ప్రశం

Satyam NEWS

జూలూరుపాడు తహసీల్దార్ గా శారద

Murali Krishna

తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవాలు

Satyam NEWS

Leave a Comment