27.7 C
Hyderabad
April 30, 2024 07: 23 AM
Slider ఖమ్మం

ప్రజాపంథా నేత రాయల మృతి

#rayala

సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా సీనియర్ నాయకులు, పిండి ప్రోలు గ్రామ సర్పంచ్ రాయల నాగేశ్వరరావు (74) గుండెపోటుతో మరణించారు. పిండిప్రోలు గ్రామ సర్పంచ్ గా నాలుగు పర్యాయాలు చేశారు. ఒకసారి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. 1973 నుండి పార్టీ కార్యకర్తగా పని చేస్తూ ప్రజా మన్న నలు పొందిన నాయకుడుగా ఎదిగాడు. నిత్యం ప్రజలతో కలిసి మెలిసి ఉండేనాయకుడు. రాయల నాగేశ్వరరావు  పిండిప్రోలు రాయల గోపాలకృష్ణయ్య మూడవ కుమారుడు. వీరి కుటుంబంలోని రాయల వెంకట నారాయణ,వీరి తండ్రి రాయల గోపాలకృష్ణయ్య తెలంగాణ సాయుధ రైతాంగపోరాట యోధులు. పిం డిప్రోలు ప్రాంత ఉద్యమ విస్తరణకు ఇతోదికంగా కృషి చేసిన వారు . ప్రజాగెరిల్ల దళాలలో పనిచేసినవారు.  రాయల నాగేశ్వరరావు రెండవఅన్న రాయల సుభాష్ చంద్రబోస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి ఏడు సంవత్సరాల క్రితం మరణించారు. రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న)స్ఫూర్తితో కామ్రేడ్ రాయల నాగేశ్వరరావు తన హెచ్ ఎస్ సి చదువు తర్వాత విప్లవ రాజకీయాల వైపు ఆకర్శితుడై గ్రామాన్ని పరిసర గ్రామాలను పార్టీ వెనుక నిలపెట్టడంలో అచంచల కృషి చేశాడు.  మరణ వార్త తెలిసిన వెంటనే సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు,రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, సర్పంచ్ల సంఘం నాయకులు పుసులూరి నరేందర్, కమ్మ కోమటి నాగేశ్వరరావు,సిహెచ్ శిరోమణి, టీ ఝాన్సీ లక్ష్మి,సి వై పుల్లయ్య,జీ రామయ్య, రాయల రవికుమార్ పులుగుజ్జు వెంకటస్వామి, ఎస్ వెంకటేశ్వర్లు, ఆరేంపుల వెంకన్న, కూసు అప్పారావు,నామ అప్పారావు, రాయిండ్ల చిరంజీవి తదితరులు హాజరైన నివాళులర్పించారు.

Related posts

తొలగించిన పింఛన్లు, రేషన్ కార్డులు పునరుద్ధరించాలి

Satyam NEWS

అక్రమంగా లింగనిర్ధారణ చేసి గర్భస్రావాలకు పాల్పడే ముఠా అరెస్టు

Bhavani

ఎదుర్లంక- యానం బాలయోగి వారధిపై ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

Leave a Comment