26.7 C
Hyderabad
May 3, 2024 08: 50 AM
Slider ప్రపంచం

వ్యాన్‌లో 28 అస్థిపంజరాలు.. ఆశ్చర్యంలో భద్రతా దళాలు

ఇండో-నేపాల్ సరిహద్దులో భద్రతా దళాలు ఓ వ్యాన్‌లో 28 ఆస్థిపంజరాలు కనుగొన్నారు. ఈ వ్యాన్‌ని మొదట జొగ్బానీ ప్రాంతంలో నేపాల్ ఆర్మ్స్ ఫోర్స్ గుర్తించారు. వెంటనే నేపాల్ సైనికులు సరిహద్దులో ఉన్న SSB అధికారులకు సమాచారం అందించారు.

వాస్తవానికి ఈ అస్థిపంజరాలు పట్టుబడిన వ్యాన్ భారతదేశం నుంచే నేపాల్ సరిహద్దుకు చేరుకోవడం గమనార్హం.ఇన్ని అస్థిపంజరాలతో నిండిన వాహనం భారతదేశ సరిహద్దును దాటి, నేపాల్ సరిహద్దుకు ఎలా చేరుకుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.

నేపాల్-భారతదేశం మధ్య ఈ సరిహద్దు గత కొంతకాలం కిందట తెరిచారు. అప్పటి నుంచి ఇక్కడ నేపాల్, భారతదేశం భద్రతా దళాలు గస్తీ కాస్తున్నాయి.ఎస్‌ఎస్‌బి బృందం సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా నేపాల్ ఆర్మ్ ఫోర్స్ సిబ్బంది మాటలు నిజమేనని తేలింది.

మగ అస్థిపంజరాలలో తల (పుర్రె), మనుషుల తొడలు, ఇతర భాగాలు ఉన్నాయి. ఈ వ్యాన్ భారతదేశం నుంచి నేపాల్ సరిహద్దుకు ఎలా చేరుకుందని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

పాఠశాలలను అందంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు మన బడి

Satyam NEWS

ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రితో మ‌హేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజి ఒప్పందం

Satyam NEWS

జైలుకు బెయిల్ కు మధ్యనున్న జాక్వెలిన్

Satyam NEWS

Leave a Comment