38.2 C
Hyderabad
April 28, 2024 19: 39 PM
Slider ప్రత్యేకం

పాఠశాలలను అందంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు మన బడి

#sabitaindrareddy

ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేవిధంగా, తాను కన్న కలలను నెరవేర్చుకునే విధంగా  కష్ట పడి చదవాలని అందుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని విద్యా శాఖామంత్రి విద్యార్థులకు భరోసా కల్పించారు. 

శుక్రవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామంలో మన ఊరు మన బడి మన బస్తీ మన బడి కార్యక్రమము కింద జిల్లా పరిషత్ పాఠశాల, మండల పరిషత్ పాఠశాల మార్చాల కు దాదాపు 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పాఠశాల ఆధునీకరణకు పార్లమెంట్ సభ్యులు పి. రాములు, స్థానిక శాసన సభ్యులు జి. జైపాల్ యాదవ్ తో కలిసి శంఖుస్థాపనలు చేశారు.

దీనితోపాటు గ్రామంలో దాదాపు 6 కోట్ల నిధులతో గ్రామమంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు.  22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతువేదిక, 5 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి వీధి దీపాలు, రోడ్డు సుందరికారణ, హై మాస్ లైట్లు, రూ. 10 లక్షలతో నిర్మించిన మైనారిటీ కమ్యూనిటీ హాలును రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు.

వైద్యం, విద్యకు పెద్ద పీట

మార్చాల లో సి.సి.రోడ్డుకు శంఖుస్థాపన,  పోస్టాఫీస్ ప్రారంభించారు.  అనంతరం మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా  మాట్లడారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వైద్యానికి పెద్దపీఠ వేశారని, అన్ని జిల్లాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు రూ. 7390 కోట్లతో అన్ని మౌళిక వసతులతో ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ఆధునికరించే కార్యక్రమం మన ఉరు మన బడి మన బస్తీ మన బడి కార్యక్రమాన్నీ ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు.  

విద్యార్థులు పదవ తరగతి తర్వాత  ఎటువంటి కోర్సులు తీసుకోవాలి, ఏ కళాశాలలో ఏ కోర్సులు ఉన్నాయి, స్కాలర్షిప్ లు ఏ విధంగా పొందవచ్చు అనే పూర్తి వివరాలు తేలిపే క్యారియర్ గైడ్ పోర్టల్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.

ఈ క్యారియర్ గైడ్ పోర్టల్ ను విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలియజేసారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం జరుగుతుందని, విద్యార్థుల్లో ఇంగ్లీష్ పై భయం పోగొట్టే విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడించి అలవాటు పరచాలని ఆదేశించారు. 

ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల

అంగన్వాడీ నుండి ఒకటవ తరగతి  బ్రిడ్జ్ క్లాస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వస్తున్నాయని ఈ విషయం పై ఆలోచిస్తామని పేర్కొన్నారు.   ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే తెలంగాణకు మొండి చెయ్యి చూపించిందని కేంద్రం పై మండిపడ్డారు. 

మార్చాల గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి దాతృత్వంతో గ్రామాన్నే కాకుండా పాఠశాలలను ఆదర్శనంగా తీర్చిదిద్దారని ఈ గ్రామం మిగతా అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.  మార్చాల గ్రామంలో వృత్తి విద్యా కోర్సుపెట్టాల ని గ్రామస్తులు కోరగా అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని జిల్లా విద్యా అధికారిని ఆదేశించారు.

ఈ కరక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు మాట్లాడుతూ మార్చాల గ్రామస్తులు ఐకమత్యం తో ఉండి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నారని, గ్రామస్తులు అందరూ ఒకే మాట ఒకే వేదికగా  ఉండి మరింత అభివృద్ధిని సాధించాలని కోరారు.  ఈరోజు 5 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ రహదారి పై విద్యుత్ దీపాలు, గ్రిల్స్, హై మాస్ లైట్, రోడ్డు సుందరికారణ పనులకు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగిందన్నారు. 

మార్చాల మీదుగా వయా కొల్లాపూర్, నంద్యాల కు రూ. 12 వందల కోట్లతో జాతీయ రహదారి  మంజూరు చేసుకోవడం నాకు అత్యంత సంతోషాన్ని  ఇచ్చే అంశం అన్నారు. దీనివల్ల మార్చాల గ్రామానికి ఎన్నో వాణిజ్య పరమైన లాభాలు ఉంటాయని పేర్కొన్నారు.   కల్వకుర్తికి ఇంజనీరింగ్, సాంకేతిక, వృత్తి పరమైన కళాశాలలు లేవని వాటిని మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. 

గ్రామస్థులు కలిసి కట్టుగా ఉంటే సాయం చేస్తా

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు జి. జైపాల్ యాదవ్ మాట్లాడుతూ  మార్చాల గ్రామం కలిసికట్టుగా పని చేస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నదని  ఈ గ్రామానికి అభివృద్ధి, సంక్షేమానికి తమవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.  ఈ రోజు ఈ గ్రామంలో 6.65 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం, శంఖుస్థాపనలు చేసుకోవడం జరిగిందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని, దాదాపు ఒక వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకొని ఒక్కో విద్యార్థి పై సంవత్సరానికి 1.25 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.  పారశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, దాతలు సైతం ముందుకు వచ్చి మరింత అద్భుతంగా పాఠశాలలను తీర్చిదిడ్డుకోవడంలో సహకరించాలన్నారు. 

ఇల్లు లేని నిరుపేదలకు గుర్తించి ఇళ్లు కట్టించేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఉచ్చిందని    విడతల వారిగా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.  దళితబంధు పథకంలో భాగంగా  చారగొండ మండలంలో 1500 లబ్ధిదారులను గుర్తించి రూ. 150 కోట్ల నిధులతో గ్రౌండింగ్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 

రాబోయే కాలంలో నియోజకవర్గానికి  2000 మంది దళిత లబ్ధిదారులను గుర్తించి దళితబంధు ఇవ్వనున్నట్లు తెలియజేసారు.  కాల్వకుర్తిలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి వంద పడకలుగా అభివృద్ధి పరిచేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలియజేసారు. 

జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి మాట్లాడుతూ పేదవారైనా తల్లిదండ్రులు తమ పిల్లల భవిషత్తు బాగుండాలని ఇంగ్లీష్ మీడియం ప్రయివేట్ పాఠశాలల్లో చేర్పించి మరింత పేదవారైపోతున్నారని గ్రహించిన రాష్ట్ర ముఖ్తమంత్రి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ఈ విద్యా సంవత్సరం నుండే ప్రారంభిస్తున్నారని అన్నారు.     విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదువుకోవాలని తెలిపారు. 

825 పాఠశాలల ఎంపిక

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మను చౌదరి జిల్లాలో 825 పాఠశాలలు మన ఉరు మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేయడం జరిగిందని మొదటి విడతలో 290 పాఠశాలలు ఎంచుకోవడం జరిగిందన్నారు. మార్చాల గ్రామము లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 47.20 లక్షలు, మండల పరిషత్ పాఠశాలకు రూ. 24. 73 లక్షల అంచనా వ్యయంతో అదనపు గదులు, కిచెన్ షెడ్, మరుగుదొడ్లు  విద్యుత్, ఇతర మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.  వచ్చే జూన్ నుండి ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నందున ఇప్పటికే ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వడం పూర్తి అయ్యిందని తెలియజేసారు.

అంతకు ముందు స్వర్గీయ మాజీ గ్రామ సర్పంచ్ ఆవ మల్లయ్యకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, ఎంపీపీ మనోహర, జడ్పిటిసి భరత్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, సర్పంచ్ సునీత, డి.ఇఓ గోవింద రాజులు, తహసిల్దార్ రాంరెడ్డి, ఎంపిడిఓ,  పీ.ఏ.సి.ఎస్ జనార్దన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బాలయ్య, ఎం.ఈ.ఓ బాసు నాయక్, ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

బీజేపీ తప్పిదం: కాంగ్రెస్ కు కలిసి వస్తున్న కాలం

Satyam NEWS

జెట్ స్పీడ్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Satyam NEWS

వినాయక చవితి నవరాత్రులు ఇంటిలోనే చేసుకోండి

Satyam NEWS

Leave a Comment