30.7 C
Hyderabad
April 29, 2024 04: 16 AM
Slider జాతీయం

బీజేపీకి కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీ

రాబోయే ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ అందుకనుగుణంగా పార్టీ కొత్త జాతీయ కార్య నిర్వాహక కమిటీని ప్రకటించింది.

ఈ కమిటీలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, గోయల్, అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి సహా 80 మంది సభ్యులు ఉన్నారు. కమిటీలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు చోటు కల్పించారు.

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకట్‌స్వామి, గరికపాటి మోహన్‌రావులకు స్థానం లభించింది. ప్రత్యేక ఆహ్వానితులుగా ఈటల రాజేందర్, విజయశాంతిలకు అవకాశం కల్పించారు.

లఖీమ్‌పూర్‌ ఘటనలో రైతులకు న్యాయం జరగాలని, కారకులకు శిక్ష పడాలంటూ సంబంధిత వీడియోను ట్వీట్‌చేసిన పార్టీ ఎంపీ వరుణ్‌ గాంధీకి కొత్త కమిటీలో చోటు దక్కలేదు. మోదీ సర్కార్‌ విధానాలపై విమర్శలు చేసిన మాజీ కేంద్రమంత్రి బీరేందర్‌ సింగ్‌తోపాటు వ్యవసాయ చట్టాల్లో రైతు అనుకూల వ్యాఖ్యలు చేసిన ఎంపీ మేనకాగాంధీని కమిటీ నుంచి తప్పించారు.

Related posts

ట్రీ ప్లాంటేషన్: లంగర్ హౌస్ లో నేడు గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS

తెలంగాణ అడవుల్లో 26 పులులు

Satyam NEWS

ములుగు లయన్స్  క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

Satyam NEWS

Leave a Comment