31.2 C
Hyderabad
May 2, 2024 23: 11 PM
Slider విజయనగరం

ఈ సారి పోలీసు స్పందనకు వచ్చిన ఫిర్యాదులెన్నో తెలుసా..

#spandana

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక,, “స్పందన” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సారి నిర్వహించిన “స్పందన” కార్యక్రమంలో  47 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

సంతకవిటి మండలానికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ప్రేమ పేరుతో పెండ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసినట్లు, ఇప్పుడు పెండ్లికి నిరాకరిస్తున్నట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని రాజాం రూరల్ సిఐను ఆదేశించారు.

విజయవాడకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ హెూటల్ వ్యాపారం నిమిత్తం విజయనగరం రింగు రోడ్డులో ఒక వ్యక్తికి  4 లక్షలు భాగస్వామ్యంగా ఇచ్చినట్లు, సదరు వ్యక్తి ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో ఫిర్యాదికి న్యాయం చేయాలని 1వ పట్టణ సిఐను ఆదేశించారు.

విజయనగరం పట్టణానికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అయ్యన్నపేటకు చెందిన ఒక వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్స్ తో 111 చ॥గ॥ల స్థలంను కొనుగోలు చేసి, మోసపోయినట్లు, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఫిర్యాదికి చట్ట పరిధిలో న్యాయం చేయాలని 1వ పట్టణ సిఐను ఆదేశించారు.

తెర్లాం మండలం జగన్నాధవలస గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం కల్పిస్తానని చెప్పిన ఒక వ్యక్తి మాటలు నమ్మి 68 లక్షలు చెల్లించినట్లు, మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేస్తున్నట్లు, వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాల్సిందిగా తెర్లాం ఎస్ఐను ఆదేశించారు.

విజయనగరంకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ భోగాపురం మండలం గూడెపు వలస, బంటుపల్లి, ముంజేరు ప్రాంతాలకు ఒక కాంట్రాక్టరుకు 3 లక్షల విలువైన కర్రను సరఫరా చేసినట్లు, సదరు వ్యక్తి డబ్బులు చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని భోగాపురం ఎస్ఐను ఆదేశించారు.

భోగాపురం మండలం రావాడ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు రావాడ గ్రామాల్లో 21 సెంట్లు భూమి కలదని, సదరు భూమి చుట్టూ ఫెన్సింగు వేసి, కొంతమంది వ్యక్తులు ఆక్రమించు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని, బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని భోగాపురం ఎస్ఐను ఆదేశించారు.

స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7దినాల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను, వెంటనే తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి.త్రినాధ్, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డిసిఆర్బి సిఐ జె. మురళి, ఎస్బీ సిఐలు రుద్రశేఖర్ పాల్గొన్నారు.

Related posts

మహారాష్ట్ర రైతులకు రూ.4వేల కోట్ల విద్యుత్‌ బిల్లు మాఫీ

Sub Editor

పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కల్యాణం

Satyam NEWS

అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో కాపు నేత తోట కృష్ణయ్య పుట్టినరోజు

Satyam NEWS

Leave a Comment