32.7 C
Hyderabad
April 27, 2024 00: 15 AM
Slider నెల్లూరు

అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో కాపు నేత తోట కృష్ణయ్య పుట్టినరోజు

#oldage home

శ్రీ కృష్ణదేవరాయ బలిజ, కాపు సంక్షేమ సేవా సంఘం, వెంకటగిరి అధ్యక్షులు, విశ్రాంత ఎక్సైజ్ శాఖ ఉద్యోగి తోట కృష్ణయ్య 62వ జన్మదిన వేడుకలను స్థానిక అమ్మానాన్న వృద్ధాశ్రమంలో ఈ రోజు కట్ చేసి నిరాడంబరంగా జరుపుకున్నారు.

అనంతరం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బిర్యాని ఆహార ప్యాకెట్లను అదేవిధంగా మాస్కుల బాక్స్ ను వృద్ధాశ్రమ నిర్వాహకులు కె. రమాకాంత్ కు అందజేశారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు కె రమాకాంత్ మాట్లాడుతూ తోట కృష్ణయ్య తనకు ఎంతో ఆప్తుడని, ఆయన సహకారం ఆశ్రమానికి ఎల్లప్పుడూ ఉంటున్నాయని అన్నారు.

ఆశ్రమానికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తున్న తోట కృష్ణయ్య కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణదేవరాయ బలిజ, కాపు సంక్షేమ సేవా సంఘం సభ్యులు కోనా వెంకటేశ్వరరావు, గొల్లగుంట రాము, పసుపులేటి తులసిదాస్, చింతకాయల మహేష్, బొబ్బిలి వెంకటేశ్వరరావు, తిరుపతి గారి ప్రసాద్, కారంపూడి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Related posts

ఉత్తమ్ కు రాఖీ కట్టిన ఆయన సోదరి

Satyam NEWS

వాహనదారులు పెండింగు చలానాలు కట్టేందుకు ఇకపై ప్రత్యేక డ్రైవ్….!

Satyam NEWS

సీఎం సహాయనిధి నిరు పేదలకు ఒక వరం : గంధం జొత్స్నా

Satyam NEWS

Leave a Comment