ఇరాక్‌లో మరోసారి రాకెట్ దాడులు జరిగినట్లు ఇరాక్ అధికార వర్గాలు తెలిపాయి.అయితే ఈ రాకెట్ దాడులవల్ల ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తినష్టం సంభవించలేదని వారు తెలిపారు.ఇరాక్ రాజధాని బగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి రాకెట్ దాడులు జరిపారు. గ్రీన్‌జోన్ ప్రాంతంలోరాయబార కార్యాలయం ప్రహారీ గోడ సమీపంలో ఐదు రాకెట్లు పడిపోగా ఎంబసీ లక్ష్యాన్ని చేరుకోలేదని అధికారులు తెలిపారు.
దాడులకు పాల్పడ్డట్లు ఇరాక్ గానీ, అమెరికా గానీ ఇంతవరకు ధ్రువీకరించలేదు.బగ్దాద్ విమానాశ్రయంలో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీపై అమెరికా డ్రోన్‌లు దాడి చేసి హతమర్చిన నాటి నుండి ఇరాన్ ప్రతికార చర్యల్లో భాగంగా ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక క్యాంపులు, రాయబార కార్యాలయంపై పలుమార్లు దాడులు చేసింది. రాకెట్ దాడులు జరుగుతున్నా గ్రీన్‌జోన్ ప్రాంతంలో ప్రముఖులు ,పలు ప్రభుత్వ కార్యాలయాలు,విదేశీ ప్రతినిధులు ఉండగా ఆ ప్రాంతం లో దాడులు జరగం తో ఇరాక్ కుతకుత ఉడుకుతుంది.యితే ఇరాక్ ప్రజలు మాత్రం తమ దేశం లో ఉన్న అమెరికా బలగాలను వెనక్కితీసుకోవాలని కోరుతూ రోడ్డెక్కడం విశేషం.