27.7 C
Hyderabad
May 11, 2024 09: 04 AM
Slider ప్రత్యేకం

ఫిబ్రవరి నాటికి దేశ జనాభాలో 50 శాతం మందికి కరోనా

#CoronaVirus

దేశ జనాభాలో 30 శాతం మంది కోవిడ్ -19 బారిన పడ్డారని కాన్పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. కరోనాపై నిపుణుల కమిటీ ఈ మేరకు నివేదిక ఇచ్చింది.

గతంలో చేసిన సర్వేలో సెప్టెంబరు నాటికి దేశ జనాభాలో 14 శాతం మాత్రమే కోవిడ్ కు ప్రభావితమయ్యారని కనుగొన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భారతదేశ జనాభాలో సగం మంది కోవిడ్ బారిన పడతారని నిపుణుల బృందం హెచ్చరించింది. ఫిబ్రవరి తరువాత కేసుల సంఖ్య తగ్గుతుందని కమిటీ వెల్లడించింది.

నోటికి ముక్కుకు మాస్కులు సరిగా ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా దేశంలో కరోనా రోగుల సంఖ్య 2.6 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించింది. 

కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కూడా కమిటీ సూచింది.

Related posts

మల్దకల్ తిమ్మప్ప ను దర్శించుకున్న సంపత్ కుమార్

Bhavani

ప్రియాంక హత్యలో ఐదోవాడు లేడు

Satyam NEWS

బస్ స్టాండ్ లో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment