40.2 C
Hyderabad
May 2, 2024 15: 28 PM
Slider ఆంధ్రప్రదేశ్

బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ, మహిళలకు నామినేటెడ్ పదవులు

రాష్ట్రంలో బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ వర్గాల మహిళల అభ్యున్నతికై నామినేటెడ్ పదవులు, వర్కు కాంట్రాక్టుల్లో 50శాతం రిజర్వేషన్లు అమలుకు ప్రభుత్వం నిర్దేశించిన ఉత్తర్వులను సక్రమంగా తుచ తప్పక పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు.

అమరావతి సచివాలయంలో సోమ‌వారం సిఎస్ అధ్యక్షతన బిసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు మహిళలకు నామినేటెడ్ పదవులు, వర్క్‌లు, కాంట్రాక్టులు, సర్వీస్ కాంట్రాక్టులు 50 శాతం రిజర్వేషన్లు అమలుకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు అమలుపై అధికారులతో సిఎస్ సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ బిసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికై వివిధ నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు అమలుకు చట్టం 24 ఆఫ్ 2019ను, అలాగే వారికి నామినేటెడ్ పనుల్లో 50శాతం రిజర్వేషన్లకై చట్టం 25 ఆఫ్ 2019 ను అమలులోకి తేవడం జరిగిందని తెలిపారు.

అదే విధంగా మహిళలకు నామినేటెడ్ వర్కు కాంట్రాక్టులు మరియు సర్వీస్ కాంట్రాక్టుల్లో 50శాతం రిజర్వేషన్లకు చట్టం 26 ఆఫ్ 2019 నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టం 27 ఆఫ్ 2019ను తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ చట్టాలను అన్ని శాఖల్లోను సక్రమంగా అమలు చేయడం ద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేయాలని సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.

సమావేశంలో బిసి సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వల్లవన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ బిసి,ఎస్సి,ఎస్టి,మైనార్టీ,మహిళకు 50శాతం రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు అమలుకు సంబంధించి 4చట్టాలను చేయడం జరిగిందని వివరించారు.

50శాతం రిజర్వేషన్లు అమలుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ నోడల్ డిపార్టుమెంట్ గా వ్యవహరిస్తుందని తెలిపారు.అలాగే మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, వర్కు కాంట్రాక్టులు కు స్తీశిశు సంక్షేమశాఖ నోడల్  డిపార్ట్ మెంట్ గా ఉంటుందని చెప్పారు. దీనిపై త్వరలో వివిధ శాఖల కార్యదర్శులు, తదితరులకు ఒక వర్క్ షాపును నిర్వహించనున్నట్టు తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు కె.దమయంతి, ఎస్ ఎస్ రావత్, బిసి సంక్షేమ శాఖ సంచాలకులు బి.రామారావు, పంచాయితీ రాజ్, రక్షిత మంచినీటి సరఫరా శాఖల ఇఎన్ సిలు సుబ్బారెడ్డి, కృష్ణా రెడ్డి,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

విద్యాసంవత్సరం ముగిసినట్టే?

Sub Editor

భక్తుల కోసం ప్రత్యేక లింక్

Murali Krishna

సమంత ఒప్పుకుంటే యశోద సీక్వెల్స్ చేస్తాం

Bhavani

Leave a Comment