28.7 C
Hyderabad
May 14, 2024 23: 48 PM
Slider సంపాదకీయం

పులివెందులలో బాబు సభ సక్సెస్ కి 6 కారణాలు

#chandra babu

సీఎం జగన్ మోహన్ రెడ్డి కంచుకోట అయిన పులివెందులలో చంద్రబాబు నాయుడు సభ సూపర్ సక్సెస్ అయింది. అంత సక్సెస్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న మెయిన్ కీ పాయింట్స్ ఏ కారణం అని, అందుకే పులివెందుల ప్రజలు బాబుగారికి బ్రహ్మరథం పట్టరాని తెలుస్తోంది.

మొదటగా చంద్రబాబు నాయుడు జగన్ సొంత గ్రామంలోనే సభ పెట్టడం వల్ల , జగన్ని సొంత ప్రజల మధ్యనే జగన్ చేస్తున్న అవినీతా పాలనను ఎండగట్టారు. రెండవది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటు సీమ జిల్లాలకు కానీ, అటు కోస్త ఆంధ్రాకి కానీ ఏమి చేసాడు అని అదే సభలో నిలదీసారు. చంద్రబాబు అడిగిన ఈ ప్రశ్నకి సభాప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగింది.

మూడవది ఆంధ్ర ప్రదేశ్ కి మూడు రాజధానులు చేస్తాను అని, అందులో ఒకటి కర్నూలును కాపిటల్ చేస్తాను అని మాటిచ్చిన జగన్,అసలు ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని లేకుండా చేసాడు ఈ జగన్ రెడ్డి అని చంద్ర బాబు నాయుడు కడిగిపారేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. పైగా పులివెందుల ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలని ముక్త కంఠంతో చెప్పారు. ఇగ నాల్గవ విషయానికి వస్తే, సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న అయిన వివేకానంద రెడ్డి హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం వహిస్తున్నారని, సొంత కుటుంబానికే న్యాయం చేయలేని అసమర్ధుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఈ సభ వేదికగా చంద్రబాబు మరో మారు తెలియచేశారు.

ఐదవ పాయింట్ కి వస్తే.. రాయలసీమని ఇండస్ట్రీ హబ్ గ చేస్తాను అని ప్రగల్బాలు పలికిన సీఎం జగన్, ఇప్పటి వరకు ఒక్క కంపెనీని కూడా తీసుకు రాలేకపోయారని చంద్రబాబు చెప్పగానే సభలో మంచి స్పందన వచ్చింది. సీమలో కరువు ఉండదు, యువత ఉద్యోగాలకోసం పక్క రాష్ట్రాలకి వెళ్ళవలసిన అవసరం లేదు అన్న జగన్, ఇప్పటి వరకు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదని చంద్రబాబు ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు , సంక్షేమ పథకాలు అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి అని చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగన్ సీఎం అయ్యాక రాయలసీమలో ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రాజెక్టులు కట్టేందుకు ఏమీ చేయలేదు. నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు చంద్రబాబు నాయుడు సీమ జిల్లాలోని ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు.

ప్రతి సంవత్సరం వేసవి వచ్చిందంటే పులివెందుల నియోజకవర్గంలోని రైతులు చెరకు చెట్లను కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి చెట్లను బతికించారు. సగటున ఒక్కో రైతు ట్యాంకర్ల కోసం రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేసేవారు. అయితే గండికోట నుంచి పులివెందులకు కృష్ణా నీటిని చంద్రబాబు నాయుడు తరలించారు. అయితే జగన్ సీఎం అయ్యి నాలుగేళ్లు పూర్తయినా ఒక్క కాలువ కూడా పూర్తి కాలేదు.చంద్రబాబు నాయుడి హయాంలో పూర్తి చేసిన ప్రోజెక్టులనే మేమె చేసాము అని, టీడీపీ కష్టాన్ని, వైసీపీ తన ఖాతాలో వేసుకుంది అని చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు.

Related posts

Beware: రెమిడిస్వేర్ కరోనాకు సంజీవని కాదు

Satyam NEWS

అమ్మకాలలో నూతన రికార్డులను సృష్టించిన సోనాలికా

Satyam NEWS

హునార్ హాట్: హస్త కళా ప్రదర్శన ప్రారంభించిన కేంద్ర మంత్రి

Satyam NEWS

Leave a Comment