29.7 C
Hyderabad
May 3, 2024 04: 18 AM
Slider ముఖ్యంశాలు

అమ్మకాలలో నూతన రికార్డులను సృష్టించిన సోనాలికా

#SonalikaTractor

2021 ఆర్థిక సంవత్సరంలో ప్రతినెలా అత్యధిక వృద్ధిని నమోదు చేస్తూ వస్తున్న సోనాలికా ట్రాక్టర్స్‌ ఇప్పుడు కేవలం 11 నెలల్లో 1,06,432 ట్రాక్టర్లను దేశీయంగా విక్రయించడం ద్వారా నూతన రికార్డులను సృష్టించింది.

గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 35.5% వృద్ధిని సోనాలికా నమోదు చేసింది.  తద్వారా  భారతదేశంలో మరే ఇతర ట్రాక్టర్‌ బ్రాండ్‌ కూడా  సాధించలేని రీతిలో తాము కార్యకలాపాలు ఆరంభించిన తరువాత అత్యంత వేగంగా ఒక లక్ష దేశీయ ట్రాక్టర్ల విక్రయాలను జరిపిన రికార్డు నెలకొల్పింది.

భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ట్రాక్టర్‌ తయారీదారునిగా నెంబర్‌ 1 ట్రాక్టర్‌ ఎగుమతి బ్రాండ్‌గా నిలిచిన సోనాలికా, మొత్తంమ్మీద ఫిబ్రవరి 2021లో 11,821 ట్రాక్టర్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే నెలలో కేవలం 9650 ట్రాక్టర్లను మాత్రమే విక్రయించింది.

ఈ అసాధారణ మైలురాయిని సాధించిన సందర్భంగా సోనాలికా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ రమణ్‌ మిట్టల్‌ మాట్లాడుతూ ‘‘కేవలం 11 నెలల్లో గత సంవత్సరంతో పోలిస్తే 35.5% వృద్ధితో మొత్తంమ్మీద 1,06,432 ట్రాక్టర్లను విక్రయించామని అన్నారు. రైతులు మా పట్ల చూపుతున్న నమ్మకానికి ఇది ప్రతీక అని ఆయన తెలిపారు.

Related posts

ఆగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికైనా న్యాయం చేయాలి

Satyam NEWS

సాక్షి భావనారాయణ స్వామి భూములు ఇవ్వద్దు

Satyam NEWS

భారత్‌కు అపురూపమైన విజయం

Satyam NEWS

Leave a Comment