గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గోపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్, ఆలివ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతం అయింది. మొత్తం 650 మందికి అప్పాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
పేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకున్ననిరుద్యోగులు ఈ కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. తమ జీవితాలలో ఈ జాబ్ మేళా కొత్తకాంతి నింపిందని వారు అన్నారు. తమకు మంచి అవకాశం ఇచ్చిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి వారు ధన్యవాదాలు తెలిపారు. నిరుద్యోగులకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఆలివ్ ఫౌండేషన్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి సన్మానం చేశారు.