రాష్ట్రానికి వచ్చిన ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డ్ ను పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చూపించారు. రాష్ట్రం ఈ ఘనతను సాధించడానికి సిఎం చేసిన సూచనలే కారణమని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో స్వచ్ఛ గ్రామీణాభివృద్ధి కోసం నిరంతర కృషి చేసిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డ్ రావడం ఎంతో సంతోషం, తృప్తి కలిగించిందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.