28.7 C
Hyderabad
May 5, 2024 23: 33 PM
Slider ఖమ్మం

శిక్షణలో క్షేత్రస్థాయి సందర్శన అత్యంత కీలకం

A field visit is crucial in training

ఆలిండియా సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ట్రైనీ అధికారులు తమ శిక్షణలో భాగంగా శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.  అధికారులను అడిషనల్ డీసీపీ గౌష్ అలమ్ స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ యస్ వారియర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ

పోలీసు శాఖలో నిత్యం జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలను కాగిత రహిత విధానంలోకి తీసుకొచ్చేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ గా  పోలీస్ శాఖను ఆధునీకరిస్తూ ఈ -ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.  అందులో భాగంగా హ్యూమన్‌ రిసోర్సు మేనేజ్‌మెంట్‌ సిస్టం ఎంట్రీ ద్వారా పోలీస్ శాఖలోని సిబ్బంది సర్వీస్ వివరాలను డిజిటలైజేషన్ చేయడం తద్వారా తన సమాచారాన్ని  నేరుగా ఆన్‌లైన్‌లో తెలుసుకునేలా సులభతరం చేసినట్లు వివరించారు. పోలీసు సిబ్బంది వ్యక్తిగత లోన్లు, సెలవులు , భద్రత స్కీమ్ , అరోగ్య భద్రత , వెల్ఫేర్ స్కీమ్ లు, ఎల్ఐసిలు, జిపిఎఫ్ కోసం అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొవచ్చని వివరించారు.

కూసుమంచి ,కామేపల్లి కల్లూరు ,చింతకాని గ్రామాలలో పర్యటించి గ్రామ స్థాయిలో ప్రజల జీవన విధానం, వ్యవసాయం, నీటి వసతి విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత అభివృద్ధి, యువతకు ఉపాధి తదితర అంశాలను అధ్యయనం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు తదితరాలను పరిశీలించాలని  తెలిపారు.

Related posts

శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు

Bhavani

వేడెక్కిన రాష్ట్రం

Bhavani

భూ బకాసురులు వస్తున్నారు జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment