39.2 C
Hyderabad
May 3, 2024 13: 48 PM
Slider సంపాదకీయం

డియర్ ప్రైమ్ మినిస్టర్: తాగుడుపై ఏమిటీ వేలం వెర్రి

#Lockdown Extension

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించి మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రాష్ట్రాలు తమ ఇష్టారీతిన రేట్లు పెంచి మద్యం వ్యాపారం చేయడం సహేతుకంగా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు మద్యం రేట్లు 25 శాతం పెంచి అమ్మింది. తాజాగా మరో 50 శాతం రేట్లు పెంచింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 70 శాతం కరోనా సర్ చార్జి పేరుతో వసూలు చేస్తున్నది.

కరోనా సమయంలో ఘోరంగా ఉందని ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అయిపోయిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ప్రవర్తించడం ఏ మాత్రం సబబుగా లేదు. కర్నాటక రాష్ట్రంలో అయితే తొలి రోజు 45 కోట్ల రూపాయల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ మిగిలిన రాష్ట్రాలలో కూడా దాదాపుగా ఇంతే వసూలు అయి ఉంటుంది. ఢిల్లీ లో దాదాపుగా 70 శాతం ప్రభుత్వం నిర్వహించే షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రయివేటు షాపులే లేవు. మిగిలిన రాష్ట్రాలలో ప్రయివేటు షాపులు ఉండటం వల్ల రేట్లు పెంచినా ప్రభుత్వాలకు అదనపు ఆదాయం తక్కుగా వచ్చే వీలు ఉన్నందున మిగిలిన రాష్ట్రాలు రేటు పెంచడం లేదు.

లాక్ డౌన్ సడలింపులపై ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు?

తొలి సారి లాక్ డౌన్ విధించినప్పుడు, పొడిగించినప్పుడు బహిరంగంగా వచ్చి మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ లాక్ డౌన్ రెండో సారి పొడిగించినప్పుడు ప్రజలతో మాట్లాడలేదు. వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపిడం, మద్యం అమ్మకాలకు అనుమతించడం లాంటి అంశాలపై కూడా ప్రధాని ప్రజలకు వివరించలేదు.

ఈ రెండు అంశాలు కూడా అత్యంత భయానకమైన పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తికి దోహదం చేసే ఈ రెండు పనులతో ఇప్పటి వరకూ దేశ ప్రజలు అనుభవించిన కష్టాలు రెట్టింపు అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విధంగా ప్రవర్తించారు.

పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ ఇలానే చేశారు

పెద్ద నోట్ల రద్దు విషయంలో కష్టాలు తాత్కాలికమేనని దేశ ప్రజలు తన కోసం ఓపికతో ఉండాలని చెబితే దేశ ప్రజలంతా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఏటీఎం ల దగ్గర క్యూలలో నిలబడ్డారు. అయితే రెండువేల రూపాయల నోట్లు కంటెయినర్ల కొద్దీ పెద్ద వారికి చేరిపోయాయని తెలిసిన తర్వాత ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

నల్ల ధనం ఒక్క రూపాయి కూడా బయటకు రాకపోగా నల్ల ధనం అంతా తెల్లధనంగా మారింది. ఇప్పుడూ అలానే జరుగుతున్నది. 40 రోజుల పాటు ఎన్నో కష్టాలు అనుభవించిన దేశ ప్రజలకు మద్యం అమ్మకాల పేరుతో దారుణమైన వెసులు బాటు తీసుకువచ్చి ప్రజలను మరింత కష్టాలలోకి నెట్టారు.

ఇప్పుడు కరోనా వ్యాప్తి జరిగితే ఎవరు బాధ్యులు?

మద్యం కోసం జనం క్యూలలో కొట్టుకు చస్తున్నారు. మద్యం అమ్మకాలతో రాష్ట్ర ప్రభుత్వాలు పండగ చేసుకుంటున్నాయి. వలస కూలీలను ఇంత కాలం ఆపి ఉంచి ఇప్పుడు ఒక్క సారిగా వదిలేస్తున్నారు. వారి ద్వారా కరోనా వ్యాప్తి జరిగితే ఎవరు బాధ్యులు?

అలాగని వారిని కుటుంబాల దగ్గరకు వెళ్లనివ్వరా అనే చచ్చు ప్రశ్నలు వేయవద్దు. అదే విధంగా ఇంత కాలం మద్యం ఎందుకు ఆపారు? ఇప్పుడు ఎందుకు గేట్లు ఎత్తారు?

అప్పుడు ఆపడానికి ఇప్పుడు గేట్లు ఎత్తడానికి సరైన కారణం చెప్పగలరా? కరోనా మూడో దశ వ్యాప్తి చెందదు అని మీకు సైంటిఫిక్ గా ఏదైనా సమాచారం ఉందా?

Related posts

టిడ్కో గృహాలు కేటాయించి, తొలగించటం అన్యాయం…

Satyam NEWS

లాక్ డౌన్ సడలింపులు క్షేమమా?

Satyam NEWS

టెస్టింగ్: హైదరాబాద్ కు వచ్చిన కరోనా కిట్లు

Satyam NEWS

Leave a Comment