40.2 C
Hyderabad
April 29, 2024 15: 56 PM
Slider గుంటూరు

టిడ్కో గృహాలు కేటాయించి, తొలగించటం అన్యాయం…

#Dr.Chadalawada

గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన టిడ్కో గృహాలను అందజేయకుండా నరసరావుపేట మున్సిపల్ అధికారులు తాత్సారం చేస్తున్నారని లబ్దిదారులు వాపోతున్నారు.

తమకు వెంటనే న్యాయం చేయాలని కోరుతూ నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు ను కలిసి లబ్ధిదారులు విన్నవించారు.

దీనిపై స్పందించిన డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ లబ్ధిదారులు వద్ద నుంచి 50 వేల రూపాయలు కట్టించుకోని ఇంటి నెంబర్లు కేటాయించిన అనంతరం వారి పేర్లను తొలగించడం భావ్యం కాదని అన్నారు.

ఎవరైతే అర్హత ఉండి ఇల్లు కేటాయించబడి ఉన్నాయో వారికి వెంటనే మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తిరిగి ఇళ్లను చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వీరందరూ అప్పులు చేసి డబ్బులు కట్టారని తెలిపారు.

సంక్షేమ పథకాలను ప్రజలకు కేటాయించటం లో కులం చూడం,మతం చూడం, పార్టీ చూడం అని చెప్తున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అలా జరగటం లేదని దుయ్యబట్టారు.

వీరందరికీ సత్వరమే కేటాయించిన ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

వ్యాక్సినేషన్ తో పోటీ పడుతున్న కరోనా వైరస్

Satyam NEWS

సమస్యలు పరిష్కరించి మహిళల అభిమానాన్ని సంపాదించాలి

Satyam NEWS

వృద్ధులకు వేసవి జాగ్రత్తలు అవసరం

Satyam NEWS

Leave a Comment