27.7 C
Hyderabad
May 15, 2024 05: 55 AM
Slider

పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలి

#polling centres

ప్రతి పోలింగ్ కేంద్రాల సందర్శన చేసి, మౌళిక సదుపాయాలు, చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. డిపిఆర్సీ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి ఇఆర్ఓ లు, ఏఇఆర్ఓలు, ఎస్డిపీవో లు, ఎస్హెచ్ఓ లతో జిల్లా ఎన్నికల కార్యాచరణ, జిల్లా బందోబస్తు కార్యాచరణ పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికి 1439 పోలింగ్ కేంద్రాలు, 718 లోకేషన్లలో ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పిమ్మట ఈ సంఖ్య పెరగవచ్చని ఆయన తెలిపారు. తహశీల్దార్లు, ఎస్హెచ్ఓలు పోలింగ్ కేంద్రాల వారిగా సందర్శన చేసి, మౌళిక సదుపాయాలు, అప్రోచ్ రోడ్లు, భద్రత, వల్నరబుల్ తదితర అంశాలపై పరిశీలన చేయాలన్నారు. 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలను ఒక సెక్టార్ గా విభజించి, సెక్టార్ అధికారిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు.

ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్ లైన్స్ ప్రకారం వల్నరబుల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇవిఎం లలో 10 శాతం శిక్షణా, అవగాహన కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు, ఇట్టి ఇవిఎం లను నియోజకవర్గాలకు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి ఇవిఎం ల భద్రతకు నియోజకవర్గాల్లో గోడౌన్ ఎంపిక చేయాలని, గోడౌన్ కు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు.

మొబైల్ డిమాన్స్ట్రేషన్ వాహనాలు నియోజకవర్గానికి 2 వస్తాయని, వీటికి గ్రామ గ్రామాన తిరిగి ఓటర్లలో ఓటింగ్ పై అవగాహన కు షెడ్యూల్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అవగాహన కార్యక్రమాలు జూలై 20 నుండి ప్రారంభమై, ఎన్నికల నోటిఫికేషన్ వరకు కొనసాగుతాయని కలెక్టర్ అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, ర్యాంప్, టాయిలెట్, ప్రహారీ ఉండేట్లు చూడాలని, చేపట్టాల్సిన మరమ్మత్తులు ఉంటే వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ఆయన తెలిపారు.

అంతర్ రాష్ట్ర సరిహద్దుల దగ్గర చెక్ పోస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఎస్ఎస్ టి, ఫ్లయింగ్ స్క్వాడ్ టీముల లోకేషన్లు తెలపాలని ఆయన అన్నారు. సమావేశంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, గతం కంటే పోలింగ్ కేంద్రాలు, ప్రదేశాలు, రూట్లు పెరిగినట్లు, పెరిగిన కేంద్రాల ప్రకారం అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

వల్నరబుల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు పోలీస్ అధికారులు క్షేత్ర పరిశీలన చేసి స్పష్టత కు రావాలన్నారు. జులై నెలాఖరు కల్లా గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రాధాన్యత నిచ్చి, ప్రమాణాల ప్రకారం గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గత చరిత్ర, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయాలని ఆయన అన్నారు.

పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపు ఇండ్ల యజమానుల వివరాలు తీసుకోవాలని, పోలింగ్ రోజున ఎలాంటి ప్రచార కార్యక్రమం చేపట్టకుండా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాకు 262 కి.మీ. మేర అంతర్ రాష్ట్ర సరిహద్దు ఉన్నట్లు, చెక్ పోస్టుల ఏర్పాటుకు కార్యాచరణ చేయాలని అన్నారు.

Related posts

యుద్ధం కారణంగా అలమటిస్తున్న దేశాలకు ఆహార పదార్ధాలు ఇస్తాం

Satyam NEWS

అమెరికా దాడితో భగ్గుమన్న ఇరాన్ పెట్రోల్

Satyam NEWS

మనల్ని వదిలి వెళ్లిపోయిన జర్నలిస్టు సురేష్

Satyam NEWS

Leave a Comment