37.2 C
Hyderabad
May 2, 2024 14: 40 PM
Slider ముఖ్యంశాలు

మార్పు కోసం కొల్లాపూర్ ప్రజల తిరుగుబాటు చేసి నేటికి రెండేళ్లు

#JupallyKrishnarao

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రజలు మార్పు కోరుకున్నారు. వారు కోరుకున్నది సాధించుకున్నారు…. కానీ ఏం జరిగింది? 2018 డిసెంబర్ 7న తొలి సారి జరిగిన ‘కొల్లాపూర్ విమోచన ఉద్యమం’ పై సత్యం న్యూస్ ప్రత్యేక కథనం ఇది.

జూపల్లి కృష్ణారావు… పరిచయం అవసరం లేని పేరు. దాదాపు రెండు దశాబ్దాలపాటు కొల్లాపూర్ కోటపై తన దైన శైలిలో ఆధిపత్యం సాగించిన నాయకుడు. ఆయన రాజకీయాన్ని ప్రత్యర్థులు ఎవరూ ఎదుర్కోలేక పోయారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఆయన సుదీర్ఘ కాలం ఆయన మంత్రిగా కొనసాగారు.

అధికార దుర్వినియోగం చేసిన అనుచరులు

అదే అవకాశాన్ని ఆయన అనుచరులు కొందరు, స్థానిక నాయకులు కలిసి ఇక్కడి ప్రజలను  అనేక ఇబ్బందులను గురి చేశారు. దాంతో ప్రజలు ఆయన పై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభించారు. స్థానిక నాయకులు, అనుచరగణం చేసిన పొరపాట్లకు 2018 డిసెంబర్ 7న  జరిగిన ఎన్నికల్లో జూపల్లి పాలనకు నియోజక వర్గ ప్రజలు ఓటుతో స్వస్తి పలికారు.

 ప్రజలు కోరుకున్న ఆ మార్పు కారణంగా బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా అయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండు నెలలకే తాను గెలిచిన కాంగ్రెస్ పార్టీని వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలస వెళ్లారు. అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వెళ్ళమని చెప్పారు. ప్రజలు నమ్మారు.

అధికార పార్టీతో అభివృద్ధి సాధ్యమవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న  అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లానని చెప్పారు. అవసరమైతే రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని చెప్పారు. ఏది ఏమైనా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు.

హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. జూపల్లి పాలనలో జరిగిన అక్రమాలను వెలికి తీసుకురావడంలో ఒక జర్నలిస్టు కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇసుక మాఫియా, కలప మాఫియా పై దినపత్రికలో వార్తలు వెలువరించడంలో ఆ జర్నలిస్టు నిర్విరామంగా కృషి చేశాడు. వార్తల కారణంగా వచ్చిన చైతన్యం అధికార మార్పిడికి మార్గం వేసింది…. కానీ…….

ఈ మార్పుకేనా ప్రజలు తిరుగుబాటు చేసింది?

అప్పటిలో ఇసుక మాఫియా నడిపిన వారిపై ఇంత వరకు ఏమీ చర్యలు లేవు. పైగా ఇసుక మాఫియాలో ప్రత్యేక పాత్ర పోషించిన వారే ఇప్పుడు అధికారం పక్కలో చేరారు. పార్టీ మారిన తర్వాత అప్పటి కేసులన్నీ  వెనక్కి   తీసుకోవడంతో  ప్రజలు  అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీల నాయకులు  సొంత  స్వలాభం కోసమే  పార్టీ మారారని, కేసు వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. వీటిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆరోపించిన వారే ఆయన పక్కన వున్నారు. ఇక ఈ రెండేళ్ల పాలనలో కొల్లాపూర్ నియోజక వర్గంలో ఎంత మార్పు వచ్చిందనేది అర్థం చేసుకోవాలి.

ఇందులో భాగంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రతిపక్ష,అఖిలపక్ష పార్టీలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాయి. అయితే 2018 ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇప్పించారు. 

ఎన్నికలు ముగిసిన కొద్ది కాలంలోనే రెవెన్యూ డివిజన్ సాధ్యమైంది. తర్వాత మరో ముఖ్య అంశం  98 జిఓ. బాధితులకు న్యాయం చేస్తానని పాలకులు చెబుతూ వచ్చారు.

కానీ… ఎవరు ఇప్పటివరకు చెయ్యలేదు

బీరం ఎమ్మెల్యే అయ్యాక  ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఇప్పించలేదు. సోమశిల సిద్దేశ్వరం వంతెన రహదారి  అంశంలో కేంద్రం  అనుకూలంగా ఉందని బీజేపీ నేతలు చెప్పినా కానీ  రాష్ట్ర ప్రభుత్వంతో ఇంతవరకు ఎలాంటి హామీని ఇప్పించలేదు  నేటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.

రహదారి, వంతెన అంశం కూడా అధికారికంగా  కేంద్రం నుంచి ఎలాంటి  ప్రకటన రాలేదు. ఎమ్మెల్యే ఈ అంశాన్ని మంత్రి దృష్టికి   తీసుకుపోయారు  కానీ ఇంతవరకు హామీ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాలేదు. ఇదిలా ఉంటే మామిడి పరిశ్రమ కూడా రాలేదు.

స్థల పరిశీలన చేశారు. కానీ ఎలాంటి పనులు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్లో మామిడి కోల్డ్ స్టోరేజ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

కొత్తగా చేసింది ఏమీ లేదు పాత వాటికే ప్రారంభోత్సవాలు

అయితే అభివృద్ధి అంశంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గతంలో ఇచ్చిన  హామీలకు వస్తే సోమశిల సిద్దేశ్వరం వంతెన కాలేదు, 98 జీవో బాధితులకు న్యాయం జరగలేదు. కానీ ఎక్కువ శాతం గతంలో  మంజూరు అయిన వాటికి ప్రారంభోత్సవాలు చేశారు.

ఇక ప్రభుత్వం ఇస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం, వ్యవసాయానికి సంబంధించిన కొను గోలు కేంద్రాలను, హరితహారం మొక్కలు నాటడం ఇలాంటివి మాత్రమే జరుగుతున్నాయి.

ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమాలను రాజకీయ కోణంలో అందచేస్తున్నారు. మాదసి మాధారి కుర్వలకు ఎస్ టి కులధృవీకరణ సిర్టిఫికెట్  వచ్చేలా చేస్తానని చెప్పారు.ఎన్నికల ముందు ఇప్పటి ఎమ్మెల్యే.ఇప్పటకి హామిగానే ఉంది.

సీఎం రిలీఫ్ ఫండ్,ఎల్వోసీ పంపిణీ చేయడంలో ఇద్దరు..

2018 ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను పక్కనపెడితే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు,ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఒకే పార్టీలో ఉంటూ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అధికారం లేకపోయినా మాజీ మంత్రి అధికార పార్టీలో కొనసాగుతున్నారు.

అధికారంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు  అనారోగ్యాలతో ఆపదలో ఉంటే  తాజా,మాజీ ఇద్దరు ఇందులో భేష్ అని చెప్పొచ్చు. నియోజకవర్గ ప్రజలకు అనుకోని సంఘటనలు, అనారోగ్య కారణానికి గురై ఆపదలో ఉంటే సిఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఎల్ ఓసి చెక్కులను  మంజూరు చేస్తూ ప్రజలకు అందజేస్తూ  నేటికి అండగా నిలుస్తున్నారు ఇద్దరు.

మున్సిపల్ అభివృద్ధికి మంజూరైన 20 కోట్ల సంగతి లేదు

మంత్రిగా జూపల్లి కృష్ణారావు  కొల్లాపూర్ నగర పంచాయతీ ఉన్నప్పుడు అప్పుడు మంత్రిగా ఉన్న జూపల్లి కొల్లాపూర్ నగర పంచాయతీ అభివృద్ధికి 20 కోట్లు మంజూరు చేస్తూ జీవో కాఫీ తెచ్చారు. పనులు ప్రారంభించే సమయంలో ఎన్నికల 2018 ఎన్నికలు వచ్చినందుకు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.

అదే ఆ సమయంలో శిలాఫలకాలు ప్రారంభోత్సవం చేశారు. అప్పటి వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చారు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్నికల అనంతరం ఎక్కడ జాడలేదు. ఇప్పటివరకు మరి ఆ జీవో కాపీ ఏమి అయిందని ప్రజలు అంటున్నారు.

అయితే నగర పంచాయతీ, మున్సిపాలిటీ అయిన తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ  నుంచి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి  అభ్యర్థులు కన్నా, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు సింహం గుర్తు నుండి గెలిచారు. అయితే అక్కడి నుండి రాజకీయాలు మరింత వేడెక్కింది.

సమస్యల నిలయంగా మునిసిపాలిటీ

ఇప్పటివరకు మున్సిపాలిటీలో  కుల సంఘాల భవనాలు,రైతు మార్కెట్,కొల్లాపూర్ ప్రెస్ క్లబ్, స్మశాన వాటికలు, కే ఎల్ ఐ అతిథిగృహం ముందు ఉన్న డ్రైనేజీ సమస్య, వంద పడకల ఆసుపత్రి ఇప్పటికి ఏవి జరుగ లేదు. అంబెడ్కర్ కళాభావనం కూడా కాలేదు.

 అస్సలుకు ఆ జీవో కాఫీ ఎక్కడుందో తెలియదు. జీవో ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. మొత్తం మీద 2018 డిసెంబర్ 7న నియోజకవర్గ ప్రజలు మార్పుకై చేసిన  తిరుగుబాటులో పార్టీల మార్పులు,రాజకీయ చర్చల తోనే   రెండేళ్లు గడిచింది.

ఎమ్మెల్యే ఇంటి పేరుతో సోదరులని ఇసుక,సారాయి బెల్లం అంశంలో చేసింది అంత ఇంత కాదు. అభివృద్ధి అంశంలో  గతంలో నిర్మాణం చేపట్టిన  మూడో వార్డు లో (చుక్కాయి పల్లి)లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం అలాగే ఉంది. అప్పుడు ఎలా ఉందో,ఇప్పుడు అలాగే ఉంది. తప్పు పడుతున్నాయి అని అక్కడి ప్రజలు అంటున్నారు. దీనిపై ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు.

అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ భవనాల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయాయి. అదేవిధంగా చుక్కాయి పల్లి చెరువు మినీ ట్యాంక్ బండి పనులు అలాగే మిగిలిపోయాయి. నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు కల్పించడం లేదు. నేటికి నియోజకవర్గానికి సోమశిల టూరిజం ప్రాంతం గుండె కాయ.

 అదికూడా గతంలోనే చేశారు. మరి ఇకపై ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి. ఎందుకు అభివృద్ధి జరగడం లేదని ఎమ్మెల్యే నే చెప్పుకున్నాడు .ప్రభుత్వం ఆర్థిక మాంద్యంలో ఉందని గతంలో చెప్పారు. అయితే  కొల్లాపూర్ ప్రజలు  కోరుకున్న మార్పులు ఇదేనా అని అనుకుంటున్నారు.

ఆడిగినవారిపై ప్రతిదాడిచేస్తున్నారు. ఇకనైనా రాబొయ్యే రోజుల్లో  ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు అంటున్నారు. ఇంకా ఏమైనా మార్పులు చూపిస్తారోనని మరోవిధంగా అనుకుంటున్నారు.

Related posts

కృష్ణా నదిపై హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులు

Satyam NEWS

కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల భేటీ

Bhavani

ఇఫ్తార్‌ విందుతో మంత్రి రోజా ఇంట ముందుగా వచ్చిన రంజాన్‌

Satyam NEWS

Leave a Comment