27.7 C
Hyderabad
April 30, 2024 09: 14 AM
Slider నిజామాబాద్

కామారెడ్డిలో విచిత్ర మాస్టర్ ప్లాన్

#minister Shabbir Ali

కామారెడ్డి మున్సిపాలిటీలో విచిత్రమైన మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేసారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. రోడ్లు పెంచాల్సిన చోట తగ్గించి, అవసరం లేని చోట 100 ఫీట్ల రోడ్డుకు ప్రతిపాదించడం విచిత్రంగా ఉందన్నారు. ట్రాఫిక్ తగ్గించడం కోసం రోడ్డును వెడల్పు చేయాల్సింది పోయి తగ్గించారన్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌన్సిల్ లో ఎలాంటి చర్చ లేకుండానే మాస్టర్ ప్లాన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.

గత నెల పదిహేను రోజులుగా రైతులు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారన్నారు. రైతుల డిమాండ్ మేరకు తమ కౌన్సిలర్లు విలీన గ్రామాలకు సంబంధించిన వారు కాకున్నా రైతులకు మద్దతుగా తమ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు పాత శివ కృష్ణమూర్తి, అన్వర్, మెహరున్నిసా, పాక జ్ఞానేశ్వరి కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేస్తున్నారని చెప్పారు.

తమ పార్టీ నుంచి 12 మంది గెలిస్తే లిక్కర్ స్కాములో సంపాదించిన డబ్బుతో ఎమ్మెల్సీ కవిత ఒక్కొక్క కౌన్సిలర్ కు లక్ష చొప్పున ఇచ్చి తమ కౌన్సిలర్లను కొనుగోలు చేసారని ఆరోపించారు. తమ పార్టీ ఇచ్చిన బి ఫార్మ్ పై గెలిచి అమ్ముడుపోయిన 8 మంది కౌన్సిలర్లు కూడా రాజీనామా చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. రైతులు చేపట్టిన ఏ కార్యక్రమంలో అయినా తమ పార్టీ నాయకులు పాల్గొంటారని, రైతులకు మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నారు.

Related posts

వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేసేందుకు పటిష్టమైన చర్యలు

Satyam NEWS

జీవో నెం:1ని శాశ్వతంగా రద్దు చేయాలి

Satyam NEWS

ప్రపంచాన్ని మళ్లీ చుట్టుముడుతున్న ఆర్ధిక మాంద్యం

Satyam NEWS

Leave a Comment