40.2 C
Hyderabad
April 26, 2024 11: 18 AM
Slider నిజామాబాద్

వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేసేందుకు పటిష్టమైన చర్యలు

#bichkunda

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయడంలో భాగంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని   పుల్కల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు మమత ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వైద్య సిబ్బందితో కలిసి బిచ్కుంద మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ కోవిడ్ వాక్సినేషన్ వేసుకోని వారికి కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ చేశారు. పర్యవేక్షణ ప్రోగ్రాం అధికారి వైద్యులు రాజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం వైద్యురాలు మమత మాట్లాడుతూ తమ బిడ్డల భవిష్యత్తు కోసం గర్భిణులు, బాలింతలు నిరభ్యంతరంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చనీ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి టీకాలు తీసుకోవాలని ఆమె కోరారు. వ్యాక్సినేషన్ వేయటానికి వచ్చిన ఆరోగ్య సిబ్బందికి ప్రజలు సహకరించి తప్పక టికాలు తీసుకోని కోవిడ్ వ్యాధి నుండి రక్షణ పొందాలన్నారు. ఈ  కార్యక్రమంలో సిహెచ్వో మారుతి, ఏపీఎం నాగరాజు, ఏఎన్ఎం బాలమణి, గ్రామ పంచాయతీ సిబ్బంది వీరేశం, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

జీ లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్

Related posts

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు

Satyam NEWS

రాజన్న రాజ్యంలో పస్తులుంటున్న మున్సిపల్ కార్మికులు

Satyam NEWS

మల్దకల్ మండలం లో మొదటిసారిగా ఆయిల్పామ్ సాగు

Satyam NEWS

Leave a Comment